జాతీయ వార్తలు

ఆ వర్శిటీలను మళ్లీ తనిఖీ చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 11: డీమ్డ్ యూనివర్శిటీ హోదా ఇవ్వడానికి అర్హమైనవి కావని 2009లో ఒక ప్రభుత్వ కమిటీ ముద్ర వేసిన 44 విద్యాసంస్థల్లో తాజాగా తనిఖీలు నిర్వహించాలని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి (హెచ్‌ఆర్‌డి) మంత్రిత్వ శాఖ యుజిసిని ఆదేశించింది. అప్పటినుంచి ఈ విద్యా సంస్థల ఉనికి ప్రశ్నార్థకంగా మారగా, కొన్ని సంస్థలు న్యాయస్థానాలను ఆశ్రయించాయి. ఈ యూనివర్శిటీలను డీమ్డ్ వర్శిటీ హోదాను కొనసాగించడానికి అనుమతించాలో లేదో నిర్ణయించడానికి వాటిని మళ్లీ తనిఖీ చేయాలని యుజిసిని కోరడం జరిగిందని హెచ్‌ఆర్‌డి మంత్రిత్వ శాఖకు చెందిన అధికారి ఒకరు చెప్పారు.
2009లో హెచ్‌ఆర్‌డి మంత్రిత్వ శాఖ నియమించిన టాండన్ కమిటీ దేశవ్యాప్తంగా ఉన్న 126 డీమ్డ్ యూనివర్శిటీలను సందర్శించి వాటిలో 44 డీమ్డ్ వర్శిటీలు ఆ హోదా పొందడానికి అర్హమైనవి కాదని గుర్తించింది. మరో 44 విద్యాసంస్థలు అనేక విషయాల్లో లోపభూయిష్టంగా ఉండగా, 38 విద్యాసంస్థల పని తీరుమాత్రం సంతృప్తికరంగా ఉన్నట్లు పేర్కొంది. అయితే వీటిలో కొన్ని డీమ్డ్ యూనివర్శిటీలు కోర్టుకు వెళ్లడంతో ఈ వ్యవహారం ఇప్పటికీ కోర్టు పరిధిలోనే ఉంది. టాండన్ కమిటీ ప్రతి విద్యా సంస్థను 45 మార్కుల ఆధారంగా అంచనా వేసింది. 15 మార్కులకన్నా తక్కువ సాధించిన విద్యాసంస్థను అనర్హమైనదిగా ముద్ర వేశారు. ఈ 44 విద్యాసంస్థలు మొదట్లో కాలేజిలు కాగా, ప్రభుత్వం ఆ తర్వాత వాటికి డీమ్డ్ యూనివర్విటీ హోదాను మంజూరు చేసింది.