జాతీయ వార్తలు

అంధేరి జంట హత్యల కేసులో నలుగురికి జీవిత ఖైదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మే 5: మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వారిని అడ్డుకోవడానికి యత్నించిన ఇద్దరు యువకులను దారుణంగా హత్య చేసిన నలుగురికి ప్రత్యేక మహిళా కోర్టు యావజ్జీవ శిక్ష విధించింది. నేరస్థులు నలుగురు తమ శేష జీవితమంతా జైల్లోనే ఉండాలని ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి వృశాలి జోషీ స్పష్టం చేశారు. 2011 అక్టోబర్ 11న ముంబయి శివార్లలోని అంధేరిలో జరిగిన ఈ సంఘటన దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. కీనన్ శాంటోస్ (24), రూబెన్ ఫెర్నాండెజ్ (29) అనే యువకులు తమ స్నేహితురాళ్లతో కలిసి అంధేరి ప్రాంతంలోని అంబోలిలో ఓ రెస్టారెంట్‌కు వెళ్లారు. భోజనం ముగించుకుని బైటికి వచ్చే సమయంలో కొంతమంది ఈవ్‌టీజర్లు వారి వెంట ఉన్న యువతుల పట్ల అసభ్యంగా ప్రవర్తించసాగారు. దీతో కీనన్, రూబెన్‌లు ఆ యువతులను కాపాడానికి ప్రయత్నించారు. అప్పటికి అక్కడినుంచి వెళ్లిపోయిన ఈవ్‌టీజర్లు ఆ తర్వాత కొద్దిసేపటికే మరికొంతమందితో కలిసి వచ్చి కీనన్, రూబెన్‌లపై దాడి చేసి అందరూ చూస్తుండగానే దారుణంగా కత్తులతో పొడిచి హత్య చేశారు. అయిదేళ్ల విచారణ తర్వాత గురువారం ప్రత్యేక మహిళా కోర్టు నిందితులు జితేంద్ర రాణా, సునీల్ బోధ్, సతీష్ దుల్హాజ్, దీపక్ తివల్‌లకు భారత శిక్షాస్మృతిలోని వివిధ సెక్షన్ల కింద హత్య, మహిళల పట్ల అసభ్య ప్రవర్తనలాంటి నేరాలకుగాను జీవిత ఖైదు విధిస్తూ తీర్పు ఇచ్చింది. కాగా, తీర్పుపట్ల కీనన్ తండ్రి వలేరియన్ శాంటోస్ సంతృప్తి వ్యక్తం చేస్తూ, ఇది అందరి విజయం అని వ్యాఖ్యానించారు. అయితే న్యాయం పొందడంలో ఆలస్యంపట్ల విచారం వ్యక్తం చేశారు. కాగా, ఈ కేసులో ప్రాసిక్యూషన్ మోపిన అభియోగాలన్నీ నిరూపణ అయినట్లు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉజ్వల్ నికమ్ చెప్పారు.