జాతీయ వార్తలు

26న ట్రంప్‌తో మోదీ భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 12:ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 25, 26 తేదీల్లో అమెరికాలో పర్యటించబోతున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆహ్వానం మేరకు వెళుతున్న మోదీ 26న ఆయనతో శిఖరాగ్ర సమావేశం జరుపబోతున్నారు. ఇప్పటికే వీరిద్దరి మధ్య అనేక సందర్భాల్లో టెలిఫోన్ సంభాషణలు జరిగినప్పటికీ ముఖాముఖీ భేటీ కావడం ఇదే మొదటిసారి అవుతుంది. అప్పటి అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆహ్వానం మేరకు చివరిసారిగా నిరుడు జూన్‌లో మోదీ ఆమెరికాలో పర్యటించారు. అమెరికా సంయుక్త సభల్ని ఉద్దేశించి కూడా ప్రసంగించిన ఘనతను సంతరించుకున్నారు. కాగా, 25, 26తేదీల్లో మోదీ అమెరికా వస్తున్న విషయాన్ని భారత ఎంబసీ ధృవీకరించింది. ట్రంప్‌తో ఆయన జరిపే చర్చల్లో హెచ్-1బి వీసాలు సహా అనేక అంశాలు ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది.
ఈ శిఖరాగ్ర భేటీ ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను కొత్త పుంతలు తొక్కించే అవకాశం ఉందని కూడా నిపుణులు చెబుతున్నారు. అలాగే అంతర్జాతీయంగా కూడా ఉమ్మడి వ్యూహంతో ముందుకెళ్లేందుకూ ఈ సమావేశం బలమైన వేదిక కాబోతోందని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. తీవ్రవాదానికి పాకిస్తాన్ మద్దతుతో పాటు ప్రాంతీయంగా పలు అంశాల్ని ట్రంప్‌తో జరిపే సమావేశంలో మోదీ బలంగా ప్రస్తావించవచ్చునని తెలుస్తోంది. రక్షణ సంబంధాల్ని కూడా బలోపేతం చేసుకునేందుకూ ఇరువురు గట్టి నిర్ణయం తీసుకునే సంకేతాలూ కనిపిస్తున్నాయి.