జాతీయ వార్తలు

మాట నిలబెట్టుకున్న మోదీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 12: ప్రధాని నరేంద్ర మోదీ దేశంలోనే కాకుండా విదేశాల్లోని భారతీయులకు సైతం సాధికారికత కల్పించడం ద్వారా ‘సబ్ కా సాథ్.. సబ్ కా వికాస్’ అనే తన మాటను నిలబెట్టుకున్నారని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం మూడేళ్లు పూర్తి చేసుకున్నందుకు గుర్తుగా సోమవారం ఇక్కడ ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో సుష్మా స్వరాజ్ మాట్లాడుతూ, మహిళలు, యువత, పేదలుసహా సమాజంలోని అన్ని వర్గాలకు సాధికారికత కల్పించడమే ప్రభుత్వం ప్రారంభించిన పథకాల ప్రధాన లక్ష్యమని అన్నారు. ప్రధాని పదవి చేపట్టిన తర్వాత పార్లమెంటునుద్దేశించి చేసిన ప్రసంగంలో మోదీ తన ప్రభుత్వం బలహీన వర్గాలు, పేదల కోసమని చెప్పారని, ప్రజలకు ఉచిత తాయిలాలు ఇవ్వడానికి బదులు తన పథకాలద్వారా వారికి సాధికారికత కల్పించి ఆయన తన మాటను నిలబెట్టుకున్నారని మంత్రి అన్నారు. ఢిల్లీ బిజెపి విభాగం ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమానికి ముద్రా, కౌశల్ వికాస్ యోజన, జన్‌ధన్, ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన లాంటి పథకాల లబ్ధిదారులు హాజరయ్యారు.
మోదీ ప్రభుత్వం విదేశాల్లో నివసిస్తున్న భారతీయులకు కూడా సాధికారికత కల్పించిందని, తమకు సాయం అవసరమైనప్పుడు ప్రభుత్వం తమను ఆదుకుంటుందన్న నమ్మకం వారిలో కల్పించిందని సుష్మా స్వరాజ్ చెప్పారు. గత మూడేళ్ల కాలంలో ప్రపంచంలో ఉద్రిక్తతలు చెలరేగిన ప్రాంతాలనుంచి లక్షా 25 వేల మందిని ప్రభుత్వం ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించగలిగిందని, ఇందులో 80 వేల మందిని తరలించడానికి ప్రభుత్వం ఆయా దేశాలకు సొమ్ము చెల్లించిందని ఆమె చెప్పారు. యెమన్‌నుంచి మాత్రమే భారతదేశం స్వయంగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించగలిగిందని, ఈ క్రమంలో ముగ్గురు పాకిస్తానీలుసహా 1947 మంది విదేశీయులను కూడా తరలించడానికి సాయపడిందని తెలిపారు.
మోదీ నాయకత్వంలో భారతదేశం ప్రపంచ అజెండాను నిర్ణయిస్తోందని కూడా సుష్మ అన్నారు. భారతదేశ సహకారం లేకుండా అంతర్జాతీయ కృషి విజయవంతం కాదని గ్రహించడంవల్లనే ప్రపంచ దేశాల నేతలు ఆయన వైపు ఆశగా చూస్తున్నారని ఆమె అన్నారు. బిజెపి ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇంటింటికి వెళ్లి, ప్రజలను కలుసుకోవడంద్వారా మోదీ ప్రభుత్వం విజయాలపట్ల జనంలో చైతన్యం కలిగించాలని సుష్మ కోరారు. ఢిల్లీ బిజెపి అధ్యక్షుడు మనోజ్ తివారి, పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు శ్యామ్ జాజు, దక్షిణ ఢిల్లీ ఎంపి రమేశ్ బిధూరి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

చిత్రం.. సోమవారం ఢిల్లీలో వివిధ పథకాల లబ్ధిదారులతో బిజెపి ఏర్పాటుచేసిన కార్యక్రమంలో అభివాదం చేస్తున్న విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్. పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు శ్యామ్ జాజు