జాతీయ వార్తలు

చట్టం అందరినీ ఒకేలా చూస్తుంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 12: ఆదాయం పన్ను రిటర్న్‌లు దాఖలు చేయడానికి ఆధార్‌ను తప్పనిసరి చేస్తూ ఆదాయం పన్ను చట్టంలో కొత్తగా చేర్చిన నిబంధన వివక్షాపూరితమైందని, రెండు వర్గాలను సృష్టిస్తుందన్న వాదన నమ్మదగ్గదిగా లేదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఆదాయ పన్ను చట్టంలోని 139ఎఎ సెక్షన్‌లో ఎలాంటి తప్పూ లేదని అభిప్రాయపడిన కోర్టు పన్ను చెల్లింపుదారులు (అసెసీలు) అందరూ ఒక వర్గమేనని, ఈ నిబంధన వారినందరినీ ఒకేలాగ చూస్తుందని వ్యాఖ్యానించింది. జూలై 1నుంచి ఆదాయం పన్ను రిటర్న్‌లు దాఖలు చేయడానికి, పాన్‌కోసం దరఖాస్తు చేయడానికి ఆధార్ నంబర్‌ను తప్పనిసరి చేస్తూ ఆదాయం పన్ను చట్టంలో కొత్తగా చేర్చిన ఈ నిబంధనను కొందరు సుప్రీంకోర్టులో సవాలు చేసిన విషయం తెలిసిందే. చట్టంలోని ఒక నిబంధనను వ్యతిరేకిస్తున్న వారితో కృత్రిమ వర్గాలను సృష్టించడంద్వారా దాని ఆధారంగా వివక్షకు గురయ్యే ప్రమాదం ఉందని వాదించి చట్టసభలు చేసిన ఒక చట్టం చెల్లుబాటును సవాలు చేయడానికి వీలులేదని గత వారం దీనిపై తీర్పు ఇచ్చిన సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ‘ఒక చట్టాన్ని చేసినప్పుడు ఆ చట్టం కిందికి వచ్చే వారందరూ దాన్ని పాటించాల్సి ఉంటుంది. చట్టసభ చేసిన ఒక చట్టం చెల్లుబాటును ప్రశ్నించే హక్కు ప్రతి పౌరుడికి ఉందనే దానిలో ఎలాంటి సందేహం లేదు. అయితే కొంతమంది ఈ చట్టాన్ని వ్యతిరేకించినంతమాత్రాన వారంతా ఒక ప్రత్యేక వర్గమైపోరు. దీని ఆధారంగా ఈ పథకం కిందికి రావాలని అనుకునేవారు, వ్యతిరేకించే వారు అంటూ రెండు వర్గాలను సృష్టించడానికి వీలులేదు’ అని న్యాయమూర్తులు ఎకె సిక్రీ, అశోక్ భూషణ్‌లతో కూడిన బెంచ్ స్పష్టం చేసింది.