జాతీయ వార్తలు

ఒడిశాకు ‘హోదా’ అర్హత లేదు: వికె సింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భువనేశ్వర్, జూన్ 13: రాష్ట్భ్రావృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేసిన నవీన్‌పట్నాయక్ ప్రభుత్వానికి ప్రత్యేక హోదాకోసం డిమాండ్ చేసే అర్హత లేదని కేంద్ర మంత్రి వికె సింగ్ స్పష్టం చేశారు. ‘అభివృద్ధిని కిందిస్థాయికి తీసుకెళ్లడంతో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. 17 ఏళ్లుగా అధికారంలో ఉన్న బిజెడి ప్రభుత్వం దీనికి సమాధానం చెప్పాలి’ అని విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి సింగ్ అన్నారు. ఇంతకుముందే 12 శాతం నిధులు అదనంగా రాష్ట్రానికి అందాయని, ఈ నేపథ్యంలో ఒడిశాకు ప్రత్యేక హోదా అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. కేంద్రనుంచి రాష్ట్రాలకు ఇబ్బడి ముబ్బడిగా నిధులు అందుతున్నందున ప్రత్యేక హోదా డిమాండ్ అర్ధరహితమని చెప్పారు. ఆయా పరిస్థితులను బట్టి రాష్ట్రాలకు ఇతోధిక సాయం అందిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ పలు సందర్భాల్లో ప్రస్తావించిన విషయాన్ని సింగ్ గుర్తుచేశారు.