జాతీయ వార్తలు

రెచ్చిపోయిన మిలిటెంట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 13: కాశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లో మంగళవారం కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే భద్రతాదళాలను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడులు జరిపారు. గ్రెనేడ్లతో విరుచుకుపడడంతోపాటు కొన్ని చోట్ల కాల్పులకు దిగారు. సిఆర్‌పిఎఫ్ శిబిరాలను, ఓ పోలీసు స్టేషన్‌ను టార్గెట్‌గా చేసుకుని జరిపిన ఈ దాడుల్లో 13మంది జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడులకు తామే పాల్పడ్డామని పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థలు అల్ ఉమర్ ముజాహిదీన్, జైషే మహ్మద్‌లు ప్రకటించుకున్నాయి. సిఆర్‌పిఎఫ్‌కు చెందిన పుల్వామా జిల్లాలోని 185 బెటాలియన్‌పై గ్రెనేడ్లు విసురుతూ ఉగ్రవాదులు దాడులు జరిపారు. ఈ ఘటనలో 10 మంది జవాన్లు గాయపడ్డారు. వీరిలో ముగ్గురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. కాగా దాడులు జరిపి పారిపోయిన ఉగ్రవాదులను పట్టుకునేందుకు అన్ని ప్రాంతాలను మూసివేసిన అధికారులు విస్తృత స్థాయిలో గాలింపుచర్యలు చేపట్టారు. మరోసంఘటనలో మోటార్ సైకిల్‌పై వెళ్తున్న ఉగ్రవాదులు ఓ సిఆర్‌పిఎఫ్ కాన్వాయ్‌పై గ్రెనేడ్లతో దాడులు జరిపారు. అలాగే పుల్వామా జిల్లాలో ఓ పోలీసు స్టేషన్‌పైన జరిగిన దాడిలో ఓ జవాను స్వల్పంగా గాయపడ్డారు.