జాతీయ వార్తలు

21న రైతుల ‘శవ ఆందోళన’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 14: దేశ వ్యాప్తం గా పెరుగుతున్న రైతుల ఆత్మహత్యలు, ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోరుతూ ఈ నెల 21న రైతు సంఘాలు ‘శవ ఆందోళన’ నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చాయి. ఢిల్లీలో బుధవారం దేశ వ్యాప్తంగా రైతుల ఆందోళనలు జరుగుతున్న పరిస్థితులలో దేశ వ్యాప్తంగా ఉన్న 14 రైతు సంఘాలు గాంధీజీ సమాది రాజ్‌ఘాట్ వద్ద రైతులకు సంఘీభావంగా మూడు గంటలపాటు వౌన దీక్షను నిర్వహించాయి. అనంతరం రైతు సంఘం ఏక్త పరిషత్ అధ్యక్షు డు ఎస్.ఎన్ రాజ్‌గోపాల్ నేతృత్వం లో రాజ్‌ఘాట్ వద్ద సమావేశమైన రైతు సంఘాలు నాయకులు ప్రస్తు తం దేశ వ్యాప్తంగా రైతులు ఏదుర్కొంటున్న పరిస్థితులపైచర్చించారు. రైతులకు సంఘీభావం తెలుపుతూ, వారికి మద్దతుగా ఈ నెల 21న దేశ వ్యాప్తంగా శవ ఆందోశన కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఆ రోజు దేశ వ్యాప్తంగా రైతులు రోడ్లపై పడుకుంటారని సంఘాల నాయకులు వెల్లడించారు. అలాగే ఈ రైతు సంఘాలు అన్ని త్వరలో ఏపీ నూత న రాజధాని అమరావతిలో రాజధాని ప్రాంతంలో జరుగుతున్న పరిణామాలను అక్కడ పర్యటించి పరిస్థితులు తెలుసుకుంటారని రైతు సంఘాలు తెలిపాయి. దేశ వ్యాప్తంగా రైతు సంఘాలు రాష్ట్రీయ స్వభిమాన్ ఆందోళన్, రాష్ట్రీయ కిసాన్ మజ్దూర్ సంఘం, జల్-జన్ జోడో అభియాన్ రైతు సంఘాలు, సుబ్బారావు, గోవిందచార్య, తదితరులు పాల్గొన్నారు.