జాతీయ వార్తలు

మైనింగ్ కేసులో కుమారస్వామికి ఊరట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, జూన్ 15: మైనింగ్ అక్రమాల కేసులో కర్నాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డి కుమారస్వామికి ఊరట లభించింది. జూన్ 20వరకూ ఆయన్ని అరెస్టు చేయడానికి వీల్లేదని ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) రాష్ట్ర హైకోర్టు ఆదేశించింది. ముందస్తు బెయిల్ పిటిషన్‌ను ప్రత్యేక కోర్టు తిరస్కరించిన నేపథ్యంలో కుమారస్వామి హైకోర్టును ఆశ్రయించారు. కేసు తదుపరి విచారణను 20వరకూ వాయిదా వేసిన న్యాయమూర్తి రత్నకళ అప్పటివరకూ కుమారస్వామి అరెస్టును ఆపాలంటూ ఆదేశాలు జారీ చేశారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జన్‌తాకాల్ అనే మైనింగ్ కంపెనీకి ప్రయోజనం కలిగించే రీతిలో అప్పటి ప్రిన్సిపల్ కార్యదర్శి బదేరియాపై కుమారస్వామి వత్తిడి తెచ్చినట్టుగా ఆరోపణలు వచ్చాయి. కాగా తన కేసు బలమేమిటో తనకు తెలుసునని కుమార స్వామి అన్నారు. ఈ కేసులోనే ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ముఖ్యమంత్రి ధరమ్‌సింగ్‌ను ప్రభుత్వం ఎందుకు వదిలేసిందని, తననే ఎందుకు టార్గెట్ చేసిందని కూడా ప్రశ్నించారు.