జాతీయ వార్తలు

మా పార్టీవారే రాష్టప్రతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూన్ 15: రాష్టప్రతి ఎన్నికల్లో ఎన్‌డిఏ నిలబెట్టిన అభ్యర్థికి 54 శాతం ఓట్లు వస్తాయని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేందర్ ఫడ్నవీస్ ధీమా వ్యక్తం చేశారు. జూలై 17న రాష్టప్రతి ఎన్నిక జరగనున్న సంగతి తెలిసిందే. రాష్టప్రతి ఎన్నికల్లో అధికార పార్టీని ఎవరూ బ్లాక్‌మెయిల్ చేయలేరని ఆయన అన్నారు. ఎన్‌డిఏ అభ్యర్థికే మెజారిటీ ఓట్లు పడతాయని అన్నారు. మొత్తంగా చూస్తే 65 శాతం ఓట్లు వస్తాయన్న విశ్వాసం ఆయన వ్యక్తం చేశారు. అయితే బిజెపితో కలిసివచ్చే పార్టీల వివరాలు మాత్రం ఆయన వెల్లడించలేదు. రాష్టప్రతి ఎన్నికలకు సంబంధించి మొత్తం ఎలక్ట్రోరల్ కాలేజీలో మొత్తం ఓట్లు 11,04,546. కాగా రాష్టప్రతి అభ్యర్థిగా ఆర్‌ఎస్‌ఎస్ అధినేత మోహన్ భాగవత్‌ను నిలబెట్టాలని శివసేన చేసిన సూచన ఫడ్నవీస్ దృష్టికి తీసుకురాగా ‘్భగవత్ దీనిపై ఎప్పుడో నిర్ణయాన్ని ప్రకటించారు. ఆయనకు ఆసక్తిలేదని తెలిపారు’ అని పేర్కొన్నారు. 37 శాతం ఓట్లు ఉన్న యుపిఏ అభ్యర్థి ప్రణబ్ ముఖర్జీ రాష్టప్రతి అయ్యారని, అలాంటిది 50 శాతం ఓట్లున్న ఎన్‌డిఏ అభ్యర్థి సునాయాసంగా నెగ్గుతారని ధీమా వ్యక్తం చేశారు.