ఆంధ్రప్రదేశ్‌

హైకోర్టు విభజనకు అనేక అవాంతరాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 15: హైకోర్టు విభజన వ్యవహారం కేసుల మూలంగా అత్యంత వివాదాస్పదంగా తయారైందని కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ భావిస్తున్నారు. రవిశంకర్ ప్రసాద్ గురువారం విలేఖరులతో మాట్లాడుతూ హైకోర్టు విభజనపై కోర్టులో పలు కేసులు దాఖలయ్యాయని తెలిపారు. పలుచోట్ల స్టేలు అమలులో ఉన్నందున విభజన వ్యవహారం ఆశించిన స్థాయిలో ముందుకు సాగటం లేదన్నారు. భవనాలు, వౌలిక దుపాయాలు సిద్ధంగా ఉంటే నూతన హైకోర్టు ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం కూడా సిద్ధమేనని ఆయన చెప్పారు. కొత్త హైకోర్టును ఏర్పాటు చేసేందుకు మంచి వసతి, సదుపాయాలు ఉండటం ఎంతో అవసరమని ఆయన స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఫెసిలిటేటర్‌గా వ్యవహరిస్తుంది తప్ప ఇతరత్రా కాదని చెప్పారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య సుహృద్భావ వాతావరణం నెలకొనాలన్నది కేంద్ర ప్రభుత్వం అభిమతమని రవిశంకర్ ప్రసాద్ సూచించారు. భవన సదుపాయం, వౌలిక సదుపాయాలు లేకుండా కొత్త హైకోర్టును ఏర్పాటు చేయటం మంచిది కాదని ఆయన అభిప్రాయపడ్డారు.