జాతీయ వార్తలు

రాష్ట్రాలను ఒత్తిడి చేయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 15: మాంసం కోసం పశువుల అమ్మకాలను నిషేధిస్తూ కేంద్రం జారీ చేసిన కొత్త నిబంధనలను అమలు చేయాలని రాష్ట్రాలపై కేంద్రం ఒత్తిడి చేయదని, అంతేకాకుండా మాంసం ఎగుమతులు దెబ్బతినకుండా ఉండడానికి ప్రత్యేకంగా మాంసం మార్కెట్లను అనుమతించే విషయాన్ని కూడా పరిశీలిస్తుందని అదనపు సొలిసిటర్ జనరల్ పి నరసింహ గురువారం తెలిపారు. పశుమాంసంపై నిషేధం విధించడం ద్వారా కేంద్రం ప్రభుత్వం దొడ్డిదారిన ఆహార అలవాట్లపై తన అభిప్రాయాలను రాష్ట్రాలపై బలవంతంగా రుద్దడానికి ప్రయత్నిస్తోందంటూ ఈ ఉత్తర్వులు వెలువడిన వెంటనే పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ విషయంలో ఏకపక్షంగా వ్యవహరించబోదనే సంకేతాలను అదనపు సొలిసిటర్ జనరల్ వ్యాఖ్యలు ఇవ్వడం గమనార్హం. కాగా, అంతకు ముందు గురువారం ఈ అంశంపై దాఖలయిన పలు పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు కొత్త నిబంధనలను రాజ్యాంగ విరుద్ధమైనవిగా ఎందుకు కొట్టివేయకూడదో తెలపడానికి కేంద్రానికి రెండు వారాలు గడువు ఇచ్చింది. ‘దేశంలో ఇప్పుడు బీఫ్‌పై ఎలాంటి నిషేధం లేదు. మద్రాసు హైకోర్టు తాత్కాలిక ఉత్తర్వుల తర్వాత దేశవ్యాప్తంగా ఈ నిబంధనలు నిలిచిపోయినట్లుగా కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది’ అని హిందుస్థాన్ టైమ్స్ పత్రికతో మాట్లాడుతూ నరసింహ అన్నారు. అంతేకాక దీనితో సంబంధం ఉన్న భాగస్వాములనుంచి అభ్యంతరాలను ఆహ్వానించే ప్రక్రియలో ప్రభుత్వం ఉందని, అలాగే ఎగుమతుల డిమాండ్లను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక మాంసం మార్కెట్లను ఏర్పాటు చేయాలనే ఆలోచన కూడా ఉందని ఆయన చెప్పారు.
మాంసం కోసం పశువుల విక్రయాలను నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం గత మే నెలలో నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. కేంద్రం ప్రకటనపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. ఈ ఉత్తర్వులు రాష్ట్రాల అధికారాల్లో జోక్యం చేసుకోవడమేనంటూ కేరళ, తమిళనాడులాంటి కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ ఉత్తర్వులను తాము అమలు చేయబోమని కూడా స్పష్టం చేశారు. చివరికి నాగాలాండ్‌లాంటి కొన్ని బిజెపి మిత్రపక్షాల పాలనలో ఉన్న రాష్ట్రాలు సైతం అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ హైదరాబాద్‌కు చెందిన ఓ స్వచ్ఛంద సంస్థతో పాటుగా పలువురు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై గురువారం విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు దీనిపై తన అభిప్రాయాన్ని తెలియజేయడానికి కేంద్రానికి రెండు వారాలు గడవు ఇచ్చింది. తదుపరి విచారణను జూలై 11కు వాయిదా వేసింది.