జాతీయ వార్తలు

‘కాళేశ్వరం’ ఓకే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 15: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి ప్రధాన అడ్డంకి తొలగిపోయింది. ప్రాజెక్టుకోసం అవసరమైన అటవీ భూములను వినియోగించుకోవడానికి కేంద్ర అడవులు, పర్యావరణ మంత్రిత్వ శాఖకు సంబంధించిన అటవీ సలహా కమిటీ అనుమతించటానికి సూత్రప్రాయంగా అంగీకరించింది. తెలంగాణ ప్రభుత్వం కోరిన విధంగా 3168.1351 హెకార్ల(7828.632 ఎకరాలు)ను వాడుకునేందుకు ఈ కమిటీ సానుకూలత వ్యక్తం చేయటంతో త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. ఢిల్లీలో గురువారం నాడు కేంద్ర అటవీశాఖ డైరెక్టర్ జనరల్ సిద్ధాంత దాస్ నేతృత్వంలో ఉన్నతాధికారులు, నిపుణులతో కూడిన అటవీ సలహా కమిటి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి తెలంగాణ నుంచి అధికారులు శైలేంద్ర కుమార్ జోషితో పాటు కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజనీర్లు హాజరయ్యారు. దేశవ్యాప్తంగా 21ప్రాజెక్టుల అజెండాలో కాళేశ్వరం ప్రాజెక్టుపై చర్చ జరిగింది. ఈప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలను అధికారులు అందించారు. ముఖ్యంగా ఎన్ని హెక్టార్ల మేరకు అటవీ భూమిని వినియోగిస్తారు? దానికి బదులుగా ఎన్ని హెక్టార్ల అడవుల పెంపకాన్ని చేపడతారన్న ప్రశ్నలకు తెలంగాణ అధికారులు సమాధానాలిచ్చారు. అటవీ అనుమతుల జారీకి సంబంధించిన సిఫార్సులను తాము చేయనున్నట్టు కమిటి తెలంగాణ అధికారులకు తెలిపింది. 15రోజుల్లో అటవీశాఖ అధికారిక ప్రకటన వెలువరించనుంది. తెలంగాణలోని ఏనిమిది జిల్లాల పరిధిలో విస్తరించి ఉన్న ఈ ప్రాజెక్టు కోసం ఏడు అటవీ డివిజన్లలోని 3168.1351 హెకార్లను వినియోగించసకునే విధంగా అనుమతి ఇవ్వాలని కేంద్రాన్ని కోరింది. దీనికి బదులుగా 4118 హెకార్లలో అడవులను పెంచుతామని తెలంగాణ అటవీ మంత్రిత్వశాఖకు గతంలోనే ప్రతిపాదించింది. కేంద్ర బృందం ఈ భూముల్ని పరిశీలించి 3367.139 హెక్టార్లలో మొక్కలను పెంచడానికి అనువైన పరిస్థితులు ఉన్నట్టు తేల్చింది. అయితే ఈ అంశాలన్నిటిపై సలహాకమిటీ సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు తెలంగాణ అధికారి ఎన్‌కె జోషి బదులివ్వడమే కాకుండా పర్యావరణానికి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యన్ని వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కాలువలు, టనె్నళ్లు, ఎత్తిపొతల వ్యవస్థ, నీటి రిజర్వాయర్లు, నీటి పంపిణీ వ్యవస్థ వంటి ఏర్పాట్లు చేయవలసి ఉందని తెలంగాణ అధికారులు అటవీ సలహా కమిటికి వివరించారు. ఈ ప్రాజెక్టుకు తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, మెదక్, నిజామాబాద్, కామారెడ్డి, నిర్మల్, మహాదేవ్‌పూర్ ఫారెస్టు డివిజన్లలోని అటవీ భూమిని ఉపయోగించుకోనే అవకాశం ఏర్పడింది.