జాతీయ వార్తలు

అద్వానీయే సరైన అభ్యర్థి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 15: రాష్టప్రతి పదవికి ఎవరిని ఎంపిక చేయాలనే అంశంపై బిజెపిలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రథయాత్ర ద్వారా బిజెపిని మొదటిసారి కేంద్రంలో అధికారంలోకి తీసుకురావటంతోపాటు పార్టీకి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిన లాల్‌కృష్ణ అద్వానీని రాష్టప్రతి పదవికి ఎంపిక చేయాలంటూ షాట్‌గన్‌గా గుర్తింపు పొందిన బిజెపి సీనియర్ నాయకుడు, ఎంపీ శతృఘ్నసిన్హా ట్వీట్లయుద్ధం మొదలు పెట్టారు. అద్వానీ అత్యంత సీనియర్ నాయకుడు, పార్టీకి జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చి జీవంపోసిన నాయకుడు కాబట్టి అతన్ని రాష్టప్రతి అభ్యర్థిగా ఎంపిక చేయాలని శతృఘ్నసిన్హా డిమాండ్ చేస్తున్నారు. రాష్టప్రతి పదవికి అద్వానీ అభ్యర్థిత్వాన్ని మరికొందరు సీనియర్ నాయకులు సైతం బలపరుస్తున్నారు, అయితే ధైర్యంగా బైటపడలేకపోతున్నారని ఆయన చెబుతున్నాడు. 2014 లోక్‌సభ ఎన్నికలకు ముందు అంటే 2013లో బిజెపి ప్రధాన మంత్రి అభ్యర్థి గురించి పార్టీలో చర్చలు జరుగుతున్న సమయంలో అద్వానీ, శతృఘ్నసిన్హా, మరికొందరు నాయకులు అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించారు. అందుకే నరేంద్ర మోదీ ఇప్పుడు రాష్టప్రతి పదవికి అద్వానీ అభ్యర్థిత్వాన్ని తోసిపుచ్చుతున్నారని బిజెపి నాయకులు చెబుతున్నారు. అద్వానీతోపాటు శతృఘ్నసిన్హా కూడా నరేంద్ర మోదీకి దూరమయ్యారనేది అందరికి తెలిసిందే. విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్ కూడా రాష్టప్రతి పదవిని ఆశిస్తున్నట్లు బిజెపి వర్గాలు వెల్లడించాయి. సుష్మా స్వరాజ్ అభ్యర్థిత్వాన్ని బిజెపికి నేతలతోపాటు తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా బలపరుస్తున్నారని చెబుతున్నారు. ప్రతిపక్షానికి చెందిన పలువురు ఇతర సీనియర్ నాయకులు సైతం సుష్మా స్వరాజ్ అభ్యర్థిత్వం పట్ల సుముఖంగా ఉన్నారని చెబుతున్నారు. ఇలావుండగా, రాష్టప్రతి పదవికి బిజెపి తరపున ద్రౌపదీ ముర్ము, లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్‌తోపాటు సుష్మా స్వరాజ్ పేరు కూడా చేరటంతో మరింత పోటీ ఏర్పడిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.