జాతీయ వార్తలు

వెల్లివిరుస్తున్న క్రీడోత్సాహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కినాలూర్ (కేరళ), జూన్ 15: గతంలో ఎన్నడూలేని విధంగా దేశంలో క్రీడోత్సాహం వెల్లివిరుస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. క్రీడల్లో కెరీర్ ఆప్షన్‌గా తీసుకునేందుకు యువత పెద్దఎత్తున ముందుకు వస్తోందని తెలిపారు. భిన్నక్రీడల్లో అద్భుతమైన ప్రతిభను కనబరుస్తూ ఎప్పటికప్పుడు దాన్ని మెరుగుపరుస్తూ యువత దాన్ని ముందుకు తీసుకుపోతోందని గురువారం ఇక్కడ ఉషా అథ్లెటిక్ స్కూల్ సింథటిక్ ట్రాక్‌ను ప్రారంభించిన సందర్భంగా మోదీ వీడయో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ పేర్కొన్నారు. దేశంలో క్రీడారంగం ఎంతగా విస్తరిస్తే అంతగానూ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతుందని మోదీ పేర్కొన్నారు. ఒకప్పుడు క్రీడలపట్ల ఎవరికీ పెద్దగా ఆసక్తి ఉండేది కాదని, వాటిలో రాణించడమే కెరీర్‌గా భావించినవారి సంఖ్యా తక్కువగానే ఉండేందని గుర్తుచేసిన మోదీ ‘ఇప్పుడు పరిస్థితి మారింది. యువత ఆలోచనలోనూ మార్పు వచ్చింది. ఈ ఫలితాలు క్రీడాంగణంలో ప్రస్పుటం అవుతున్నాయి’ అని తెలిపారు. క్రీడల్లో రాణించడానికి అవసరమైన సత్తా భారత్‌కు పుష్కలంగా ఉందని ప్రధాని చెప్పారు. చాంపియన్స్ ట్రోఫీ జరిగినా, ఇపిఎల్, ఫుట్‌బాల్ మ్యాచ్ జరిగినా, ఎన్‌బిఏ బాస్కెట్‌బాల్ మ్యాచ్ జరిగినా, ఎఫ్‌ఓన్ రేసులు జరిగినా ప్రజలు ఎంతో ఆసక్తిగా చూస్తారన్న మోదీ భారతదేశం మొదటినుంచీ క్రీడలను అభిమానించే దేశమని అన్నారు. దేశంలో ప్రతిభకు కొదవలేదని, అయితే సరైన అవకాశం ఇచ్చి మరింత సానబట్టాల్సిన అవసరం ఉందని వెల్లడించారు. క్రీడలు ఎంతగా అభివృద్ధి చెందితే అంతగానూ ఆర్థిక వ్యవస్థకు మేలుజరగడమే కాకుండా ఉపాధి అవకాశాలూ పెరుగుతాయన్నారు. క్రీడా ఆర్థిక వ్యవస్థను పెంపొందించడానికి బలమైన క్రీడా సంస్కృతిని పాదుగొల్పాల్సిన అవసరం ఉందని, ఇందుకు వీలుగా దేశంలోని క్రీడా మైదానాలు, స్టేడియాలను గరిష్ఠస్థాయిలో ఉపయోగించుకోవాలని చివరికి సెలవులను కూడా ఆటలు ఆడడానికో చూడడానికో వినియోగించుకోవాలన్నారు. విపరీతమైన వినియోగదారుల డిమాండ్ గలిగిన వందల కోట్ల డాలర్ల అంతర్జాతీయ పరిశ్రమగా క్రీడలను ఆయన అభివర్ణించారు. అంతర్జాతీయ క్రీడా పరిశ్రమ విలువ 600 బిలియన్ డాలర్లని, భారత్ మొత్తం క్రీడా పరిశ్రమ విలువ 2 బిలియన్ డాలర్లేనని ప్రధాని గుర్తుచేశారు. అనేక రంగాల్లో అద్భుతంగా రాణిస్తూ మహిళలు దేశానికి ఎంతో పేరుతెచ్చారన్న మోదీ ‘ప్రతి ఒక్కరూ తమ పిల్లలను వారికి ఆసక్తి ఉన్న క్రీడల్లో ప్రోత్సహించాలి’ అని తెలిపారు. ఇటీవల జరిగిన పారా ఒలింపిక్స్‌లో కూడా మన క్రీడాకారులు అద్భుతంగా రాణించిన విషయాన్ని గుర్తుచేశారు. 2022 నాటికి భారత్ 75 సంవత్సరాల స్వాతంత్య్రాన్ని పూర్తి చేసుకోబోతుందన్న ప్రధాని అప్పట్లోగా సాధించాల్సిన లక్ష్యాలపై క్రీడాకారులు, క్రీడా సంస్థలు దృష్టిపెట్టాలన్నారు.