జాతీయ వార్తలు

భూ కుంభకోణం నిందితులకు బెయిల్ మంజూరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 16: మియాపూర్ భూముల కుంభకోణంలో నిందితులుగా ఉన్న ట్రీనిటీ ఇన్‌ఫ్రా వెంచర్స్ లిమిటెట్ డైరెక్టర్ పిఎస్ పార్ధసారధి, సువిశాల్ పవర్ జనరేషన్ లిమిటెట్ డైరెక్టర్ పీవీఎస్ శర్మలకు సుప్రీకోర్టు బెయిల్ మంజూరు చేసింది.బెయిల్ కోసం పార్థసారధి,శర్మలు సుప్రీంకోర్టులో దాఖలు చేసుకున్న పిటిషన్లను న్యాయమూర్తులు జస్టిస్ ఆర్‌కే అగర్వాల్,జస్టిస్ సంజయ్ కిషాన్ కౌల్‌లతో కూడిన ధర్మాసనం శుక్రవారం నాడు విచారణ జరిపారు.నిందితుల తరపున న్యాయవాదులు కెటి తులసి, జంద్యాల రవిశంకర్ వాదనలు వినిపిస్తూ సివిల్ కేసును క్రిమినల్ నిబందనల ప్రకారం కేసులు నమోదు చేశారని వెల్లడించారు.ఈ భూములు అన్ని ప్రభుత్వానివా లేక ప్రైవేటువా అన్నది కేసు నమోదు చేయ్యలేదని, ఈ భూముల విషయంలో మూడు విధాలుగా కేసులో నమోదు చేశారని వాదనలు వినిపించారు.అలాగే భూములు ప్రభుత్వవి అయినప్పుడు వాటి రిజిష్ట్రేషన్లు రద్దు చేసుకోసుకొని,సివిల్ నిబంధనల ప్రకారం కేసులు నమోదు చేయ్యవచ్చునని వాదించారు.కింది కోర్టు ఆదేశాల ప్రకారం షరతులు ఉంటాయని పేర్కొంటూ వారికి ధర్మాసనం బెయిల్ మంజూరు చేసింది.ఈ నెల 15 నాడు మియాపూర్ భూములు కుంభకోణంలో నిందితులకు ఉమ్మడి హైకోర్టు పార్థసారధి,శర్మలకు బెయిల్ నిరాకరించింది.దీంతో సుప్రీంకోర్టు అశ్రయించగా వారికి బెయిల్ మంజూరు అయ్యింది.