జాతీయ వార్తలు

మీ అభ్యర్థి ఎవరు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 16: రాష్టప్రతి అభ్యర్థి పేరు చెప్పనంత వరకు మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ బిజెపి త్రిసభ్య కమిటీ సభ్యులకు తెగేసి చెప్పారని తెలిసింది. హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్, సమాచార శాఖ మంత్రి వెంకయ్యనాయుడు రాష్టప్రతి అభ్యర్థి ఎంపికపై శుక్రవారం ఇక్కడ సోనియాగాంధీతో చర్చించారు. రాష్టప్రతి అభ్యర్థి ఎంపికకు కాంగ్రెస్ సహకారం కావాలని కేంద్ర మంత్రులు ఆమెను కోరినట్టు ఏఐసిసి వర్గాలు వెల్లడించాయి. రాష్టప్రతి పదవికి బిజెపి ఎవరిని ఎంపిక చేసిందని సోనియా గాంధీ వాకబు చేయగా అభ్యర్థి ఎంపిక ఇంకా జరగలేదని కేంద్ర మంత్రులు సమాధానం ఇచ్చినట్లు తెలిసింది. అభ్యర్థిని ఎంపిక చేయకుండా కాంగ్రెస్ మద్దతు కోరడంలో అర్థం లేదని సోనియా త్రిసభ్య కమిటీ సభ్యులతో అన్నట్టు ఆ వర్గాలు పేర్కొన్నాయి. రాష్టప్రతి పదవికి ప్రతిపక్షం ఎవరి పేరునైనా ప్రతిపాదిస్తుందా? అని ఇరువురు మంత్రులు అడుగ్గా అధికార పక్షం అభ్యర్థి ఎంపిక జరగనంత వరకు ప్రతిపక్షం తమ అభ్యర్థి పేరు ప్రకటించడం సాధ్యంకాదని సోనియా స్పష్టం చేసినట్లు ఆ వర్గాలు చెబుతున్నాయి. అధికార పక్షం అభ్యర్థి పట్ల తమకు అభ్యంతరం ఉంటే పోటీ తప్పదని కూడా సోనియా వారితో చెప్పారని అంటున్నారు.