జాతీయ వార్తలు

జస్టిస్ నాగార్జునరెడ్డి అభసంశన అంశం మళ్లీ విఫలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 16: తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు జడ్జి జస్టిస్ నాగార్జున రెడ్డి అభసంశనకు తాజాగా చేసిన ప్రయత్నం మళ్లీ విఫలమైంది. గత కొద్ది నెలలుగా రాజ్యసభ ఎంపీలు జస్టిస్ నాగార్జున రెడ్డి అభిసంశనకు విఫలయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. హైకోర్టులో దళితుడైన జూనియర్ జడ్జి ఎస్ రామకృష్ణతో అనుచితంగా ప్రవర్తించారని, అతనిని కులం పేరుతో ధూషించడమే కాకుండా తన కింది స్థాయిలో సిబ్బంది కార్యకలాపాల్లో అనవసరంగా జోక్యం చేసుకున్నారనే అభియోగాలపై జస్టిస్ నాగార్జున రెడ్డిని అభిసంశించాలని గత డిసెంబరులో వివిధ పార్టీలకు చెందిన కొంత మంది రాజ్యసభ సభ్యులు ప్రయత్నించి విఫలమయ్యారు. తాను చెప్పినట్లు వినాలని, తన న్యాయ వ్యతిరేక డిమాండ్లకు తగ్గట్టుగా నడుచుకోవాలని జూనియర్ జడ్జిపై వత్తిడి తెచ్చారని, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్న అరోపణలపై కొన్ని రాజకీయ పార్టీలకు చెందిన ఎంపీలు సంతకాలు చేసి జస్టిస్ నాగార్జున రెడ్డి అభిసంశనకు రాజ్యసభ చైర్మన్‌కు వినతిపత్రం అందజేశారు. అంతే కాకుండా జస్టిస్ నాగార్జున రెడ్డి అదాయానికి మించి ఆస్తులు కలిగివున్నారని కూడా వారు ఆరోపించారు. అయితే అందులో కొంతమంది ఎంపీలు తర్వాత వెనక్కి తగ్గడంతో అప్పట్లో జస్టిస్ నాగార్జున రెడ్డి అభిసంశన అంశం మరుగున పడిపోయింది. చట్టం ప్రకారం హైకోర్టు జడ్జిని అభిసంశించాలంటే కనీసం 50 మంది రాజ్యసభ సభ్యులు గాని అంతకంటే రెండింతల సంఖ్యలో లోక్‌సభ సభ్యులుగాని సంతకాలు చేసి సభాధ్యక్షుడికి నోటీసులు ఇవ్వాల్సి ఉంటుంది. తాజాగా తెలుగు దేశం, తెలంగాణ రాష్ట్ర సమితి, సిపిఎం, తదితర పార్టీలకు చెందిన 54 మంది ఎంపీలు జస్టిస్ నాగార్జున రెడ్డిని అభిసంశించాలని డిమాండ్ చేస్తూ సంతకాలు చేసి రాజ్యసభ చైర్మన్‌కు వినతిపత్రం అందజేశారు. అయితే గతంలో లాగానే ఈసారి కూడా 54మంది ఎంపీల్లో తొమ్మిది మంది ఉపసంహరించుకోవడంతో జస్టిస్ నాగార్జున రెడ్డి అభిసంశన యత్నం మళ్లీ విఫలమైంది.