జాతీయ వార్తలు

ఆధార్ ఉంటేనే బ్యాంక్ ఖాతా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 16: ఆధార్ విషయంలో కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా బ్యాంక్ ఖాతాలు తెరిచే వారు తమ ఆధార్ నంబర్లను తప్పకుండా పేర్కొనాలి. అలాగే 50 వేలకు పైబడిన ఆర్థిక లావాదేవీలన్నిటికీ ఆధార్‌ను తప్పనిసరిగా కోట్ చేయాలని కూడా పేర్కొంది. అంతేకాకుండా ఇప్పుడు బ్యాంక్ ఖాతాలు కలిగి ఉన్న వారు సైతం తమ బ్యాంక్ ఖాతాలతో ఆధార్‌ను అనుసంధానం చేసుకోవాల్సి ఉంటుంది. అందుకు డిసెంబర్ 31 వరకు గడువు విధించింది. ఆ లోగా ఆధార్ వివరాలు సమర్పించని బ్యాంక్ ఖాతాలు చెల్లవని కూడా స్పష్టం చేసింది. ఈ మేరకు శుక్రవారం రెవిన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, పాన్‌కార్డుల దుర్వినియోగానికి అడ్డుకట్ట వేయడానికి ఆదాయం పన్ను శాఖ ఇప్పటికే పాన్ కార్డులకు ఆధార్‌ను తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే. మరోవైపు 2 లక్షలు అంతకు పైబడిన నగదు లావాదేవీలు జరపవద్దని, ఒక వేళ అలా జరిపితే ఆ సొమ్ము అందుకున్న వ్యక్తి అంతే మొత్తాన్ని పెనాల్టీగా చెల్లించాల్సి ఉంటుందని ఇప్పటికే స్పష్టం చేసింది కూడా. ఆదాయం పన్ను చట్టం 2017 ద్వారా ప్రభుత్వం ఈ ఏడాది ఏప్రిల్ 1నుంచి 2 లక్షలు, అంతకు పైబడిన నగదు లావాదేవీలను నిషేధించిన విషయం తెలిసిందే. ఆదాయం పన్ను చట్టంలో కొత్తగా చేర్చిన 269 ఎస్‌టి సెక్షన్‌కు భిన్నంగా అలాంటి భారీ నగదు లావాదేవీలు జరిపిన పక్షంలో నగదు అందుకున్న వ్యక్తిపై 100 శాతం పెనాల్టీ విధించడం జరుగుతుందని ఆదాయం పన్ను శాఖ ప్రముఖ దినపత్రికల్లో ఇచ్చిన ఓ ప్రకటనలో స్పష్టం చేసింది.