జాతీయ వార్తలు

అందరికీ ఒకే నిబంధనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, జూన్ 16: విమానయాన రంగంలో సాధారణ ప్రయాణికులకు ఏ నిబంధనలు వర్తిస్తాయో అవే నిబంధనలు ఎంపీలకూ వర్తిస్తాయని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి పి.అశోక్‌గజపతిరాజు స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన ఇక్కడ మోదీ ఫెస్ట్ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం తనను కలిసిన విలేఖరులతో మాట్లాడుతూ ఎంపీలంటే గౌరవిస్తారే తప్ప నిబంధనలు మారవని గుర్తు చేశారు. అనంతపూర్ ఎంపి జెసి దివాకర్‌రెడ్డిని ఇండిగో, ఎయిర్ ఇండియా, స్పైస్ జెట్, జెట్ ఎయిర్‌వేస్ సంస్థలు తమ విమానాల్లో ప్రయాణించడాన్ని నిషేధించిన విషయాన్ని ప్రస్తావించగా జెసి ప్రయాణంపై నిషేధం లేదా కొనసాగింపు అనే అంశం మంత్రిత్వశాఖ పరిధిలోకి రాదని స్పష్టం చేశారు. మంత్రిత్వశాఖ అనేది కేవలం విమానయాన రంగం అభివృద్ధి కోసమని, అందుకోసం ఏ చర్యలు చేపట్టాలనే అంశాలను పరిశీలిస్తుందని వివరించారు. ఆ అంశం సేఫ్టీ అండ్ సెక్యూరిటీకి సంబంధించినదని, దానిని వారే పరిశీలిస్తారన్నారు. గతంలో శివసేన ఎంపి గైక్వాడ్ విమానయాన సిబ్బందితో గొడవకు దిగినపుడు ప్రయాణికుల నుంచి అనేక సలహాలు వచ్చాయని, ఆ మేరకు పార్లమెంట్‌లో ఆ చట్టాన్ని సవరించినట్టు తెలిపారు. ఇలాంటి సందర్భాల్లో రిటైర్డ్ జడ్జితో విచారణ జరుపుతారని వివరించారు. అసలు నిజం ఏమిటన్నది మూడు స్థాయిల్లో గుర్తిస్తారని చెప్పారు. కాగా, ఎంపి జెసి దివాకర్‌రెడ్డి ఈ వివాదం విషయమై తనతో మాట్లాడుతూ తాను గంట ముందుగా వచ్చినప్పటికీ బోర్డింగ్ పాస్ ఇవ్వకుండా ఇండిగో ఎయిర్‌లైన్స్ సిబ్బంది జాప్యం చేశారని తనతో చెప్పారన్నారు. కాగా, నిజం ఏమిటన్నదీ సిసి ఫుటేజ్‌లో కన్పిస్తుందన్నారు.
ఎయిర్ ఇండియా ప్రైవేట్‌పరం?
ఇటీవల ఇండియన్ ఎయిర్‌లైన్స్, ఎయిర్ ఇండియా సంస్థలను ప్రభుత్వం ప్రైవేటుపరం చేస్తుందని జోరుగా ప్రచారం జరుగుతున్న విషయాన్ని ఆయన వద్ద ప్రస్తావించగా ప్రస్తుతం ఎయిర్ ఇండియా పెర్‌ఫార్మెన్స్ మెరుగుపడిందన్నారు. అంతర్జాతీయ పౌరవిమానయాన రంగానికి చెందిన సంస్థ ఆడిట్‌లో ఉత్తమ సంస్థగా గుర్తింపు సాధించిందన్నారు. ఎయిర్ ఇండియా సేవలు విస్తృతం కావాలంటే రూ.52వేల కోట్లు పెట్టుబడి కావాలన్నారు. అందువల్లనే ప్రైవేట్‌పరం ఒక్కటే మార్గమన్నారు. గతంలో 7వేల మంది పైలెట్లు నిరుద్యోగులుగా ఉండగా తాను మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత ఆ సంఖ్య 3వేలకు వచ్చిందన్నారు. టెలికాంను ప్రైవేటు పరం చేసిన తరువాత ఏ విధంగా ఫలాలు అందినదీ వివరించారు.
అభివృద్ధి వేగవంతం
ప్రధాని మూడేళ్ల పాలనపై మాట్లాడుతూ ప్రపంచంలో అన్ని దేశాలు అభివృద్ధిలో కుంటుపడగా, భారత్ మాత్రం పరుగులు తీస్తోందని కేంద్రమంత్రి అశోక్‌గజపతిరాజు అన్నారు. వాటిలో ఎల్‌ఇడి బల్బుల వినియోగంలో ఎపి ఆదర్శంగా నిలిచిందన్నారు. అశోక్‌తోపాటు నరసాపురం ఎంపి గోకరాజు గంగరాజు, బిజెపి జిల్లా అధ్యక్షుడు పెద్దింటి జగన్మోహనరావు తదితరులు పాల్గొన్నారు.

చిత్రం.. కేంద్రమంత్రి అశోక్‌గజపతిరాజు