జాతీయ వార్తలు

కొత్త టెక్నాలజీతో పాటుగా ఎదగండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుణె, జూన్ 17: ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లకు కేంద్రం టెక్నాలజీయేనని రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ అంటూ, ఆర్మీలోని ఇంజనీర్లు కొత్త టెక్నాలజీకి సమాంతరంగా ఎదగడమేకాకుండా దాన్ని సైన్యంకోసం మరింత మెరుగ్గా ఉపయోగించాలని అన్నారు. శనివారం ఇక్కడ కాలేజ్ ఆఫ్ మిలిటరీ ఇంజనీరింగ్ (సిఎంఇ) స్నాతకోత్సవంలో రాష్టప్రతి మాట్లాడుతూ, మంచి ఇంజనీర్లుగానే కాక మంచి సైనికులుగా కూడా ద్వంద్వ పాత్రలను పోషించడానికి సిద్ధంగా ఉండాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. దేశీయంగానే కాక అంతర్జాతీయంగా కూడా కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయని, ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లన్నిటికీ కేంద్రం టెక్నాలజీయేనని, సాంకేతిక పరిజ్ఞానాన్ని దేశ భద్రతకోసం ఉపయోగించేందుకు మీరు సిద్ధంగా ఉండాలని కూడా ఆయన అన్నారు. దేశంలోని మారుమూల ప్రాంతాల్లో వౌలిక సదుపాయాల కల్పన అనే గురుతరమైన బాధ్యత మీ భుజస్కందాలపై ఉందని ఇంజనీరింగ్ పూర్తి చేసుకొని వెళ్తున్న విద్యార్థులనుద్దేశించి అన్నారు. భారత సైన్యానికి చెందిన ఈ ప్రతిష్ఠాత్మక ఇంజనీరింగ్ విద్యాసంస్థనుంచి 71 మంది ఎంటెక్, బిటెక్ విద్యార్థులు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్నారు. జమ్మూ, కాశ్మీర్‌లో సాయుధ దళాలు తక్కువ స్థాయి తీవ్రత కలిగిన ఆపరేషన్లలో పాలుపంచుకొంటున్నాయని ఆర్మీ ట్రైనింగ్ కమాండ్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ లెఫ్టెనెంట్ జనరల్ డిఆర్ సోనీ అంతకు ముందు మాట్లాడుతూ అన్నారు. నేటి కల్లోలిత ప్రాంతీయ పరిస్థితుల్లో పూర్తిస్థాయి యుద్ధానికి సైతం ఎల్లవేళలా సంసిద్ధంగా ఉండాలని కూడా ఆయన అన్నారు.