జాతీయ వార్తలు

ప్రపంచ శాంతి సూచీలో భారత్‌కు 137వ స్థానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 17: దక్షిణసియాలో అత్యంత శాంతియుత దేశాల్లో ఒకటిగా గుర్తింపుపొందిన భారత దేశం తాజాగా నిర్వహించిన ఓ సర్వేలో అంతర్జాతీయం గా 137వ స్థానంలో నిలిచింది. ఆస్ట్రేలియా కు చెందిన ఇనిస్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్ సంస్థ 2017 సంవత్సరానికి గాను గ్లోబల్ పీస్ ఇండెక్స్‌ను రూపొందించింది. ఈ జాబితాలో 13వ స్థానంలో నిలిచిన భూటాన్ దక్షిణాసియాలోనే అత్యంత శాంతియుత దేశంగా నిలిచింది. శ్రీలంక 80వ స్థానంలో నిలవగా, బంగ్లాదేశ్ 84, భారత్ 137, పాకిస్తాన్ 152, అఫ్గానిస్థాన్ 162వ స్థానంలో నిలిచాయి. కాగా, 2011 లో సిరియా యుద్ధం మొదలైన తర్వాత మొట్టమొదటిసారిగా ప్రపంచవ్యాప్తంగా శాంతిస్థాయి స్వల్పంగా మెరుగుపడినట్లు సిడ్నీ కేంద్రంగా పని చేసే ఈ స్వచ్ఛంద సంస్థ తెలిపింది. 2008 నుంచి ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా శాంతి 2.14 శాతం దిగజారిందని, 80 దేశాల్లో మెరుగుపడగా, 83 దేశాల్లో దిగజారిందని ఆ సర్వే పేర్కొంది.