జాతీయ వార్తలు

డార్జిలింగ్‌లో ఉద్రిక్తత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డార్జిలింగ్, జూన్ 17: పశ్చిమబెంగాల్‌లోని డార్జిలింగ్‌లో రోజు రోజుకూ పరిస్థితి దిగజారుతోంది. గూర్ఖా జనముక్తి మోర్చా గత ఆరు రోజులుగా ప్రత్యేక రాష్ట్రం డిమాండ్‌పై నిరవధిక బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో శనివారం హింసాకాండ పెచ్చుమీరింది. గూర్ఖా జనముక్తి మోర్చా సీనియర్ నాయకుడి ఇంటిపై శుక్రవారం రాత్రి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి విధ్వంసం సృష్టించారు. దీంతో శనివారం ఉదయం ప్రారంభమైన నిరసన ప్రదర్శనలు హింసాత్మకంగా మారాయి. పోలీసులు జరిపిన కాల్పుల్లో తమ కార్యకర్తలు ఇద్దరు మరణించారని జిజెఎం నాయకుడు బినయ్ తమాంగ్ తెలిపారు. అయితే పోలీసులు మాత్రం జిజెఎం కార్యకర్తలే ముందుగా పోలీసులపై కాల్పులు ప్రారంభించారని, పోలీసు వాహనానికి నిప్పంటించారని, జిజెఎం మద్దతుదారుల కాల్పుల్లో ఒక జిజెఎం కార్యకర్త మరణించారని అదనపు డిజి అనుజ్ శర్మ తెలిపారు. తాము అసలు కాల్పులు జరపనే లేదని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ ఈ ఘటనలపై తీవ్రంగా స్పందించారు. ‘‘అయిదేళ్ల పాటు(జిజెఎం) మీరు హాయిగా ఉన్నారు. ఇప్పుడు ఎన్నికలు ముంచుకొచ్చేసరికి మీరు విశ్వసనీయత కోల్పోవటంతో మళ్లీ హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్నారు. ఈ ఘటనల వెనుక పెద్ద కుట్ర దాగి ఉంది. ఈ ఆయుధాలు ఒకరోజులో సమకూర్చుకున్నవి కావు. చాలాకాలంగా వీటిని సేకరిస్తూ ఉన్నారు’’ అని మమత ఆరోపించారు. ఈ సందర్భంగా ఎస్పీ అఖిలేశ్ చతుర్వేది మాట్లాడుతూ రెండో బెటాలియన్‌కు చెంది. అసిస్టెంట్ కమాండంట్ కిరణ్ తమాంగ్ జిజె ఎం కార్యకర్తల దాడిలో చనిపోయారని వెల్లడించారు. అయితే ఈ వార్తలను ముఖ్యమంత్రి మమత తోసిపుచ్చారు. తమాంగ్ జీవించే ఉన్నారని, ఆయన పరిస్థితి విషమంగా ఉన్నారని తెలిపారు. జిజె ఎంతో తాము చర్చలకు సిద్ధంగానే ఉన్నామని కానీ వారు ముందుగా హింసను విడిచిపెట్టి పరిష్కారానికి ముందుకు రావాలని స్పష్టం చేశారు.
నిరసనకారులు పలు చోట్ల పెట్రోల్ బాంబులు, రాళ్లు పోలీసులపైకి విసిరారు. పోలీసు బలగాలు వారిపై బాష్పవాయు ప్రయోగం చేశారు. ఆందోళనకారులను చెదరగొట్టడానికి లాఠీచార్జ్ కూడా చేశారు. ఈ ఘర్షణల్లో ఎనిమిది మంది పోలీసులు గాయపడ్డారు. మరోవైపు తమ ఆందోళనను విరమించాలని ఆలోచించటం లేదని బినయ్ తమాంగ్ స్పష్టం చేశారు. తమ డిమాండ్‌లను పరిష్కరించకపోతే మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.

చిత్రం.. డార్జిలింగ్‌లోని ఓ ప్రాంతంలో అల్లరి మూకలను చెదరగొట్టేందుకు
శనివారం బాష్పవాయు గోళాలను ప్రయోగిస్తున్న పోలీసులు