జాతీయ వార్తలు

సమగ్రతే మిలటరీ ఉద్యోగానికి పునాది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/జీడిమెట్ల, జూన్ 17: సమగ్రతే మిలటరీ ఉద్యోగానికి పునాది అని, అదే లోపిస్తే సమాజం మనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేసినట్లేనని దేశ సైన్యాధిపతి బిపిన్ రావత్ అన్నారు. ఒక వేళ రక్షణ దళాలపై సమాజానికి నిజంగానే నమ్మకం పోతే జాతీయతకు తీవ్ర ఇబ్బంది కలుగుతుందని అన్నారు. శనివారం నాడిక్కడ దుండిగల్ ఎయిర్‌ఫోర్స్ అకాడమిలో 199వ పైలెట్స్, గ్రౌండ్ డ్యూటీ ఆఫీసర్ల కోర్సు పూర్తి చేసిన క్యాడెట్లకు నిర్వహించిన కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్‌కు బిపిన్ రావత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ పరేడ్‌లో 120 మంది క్యాడెట్లు పాల్గొన్నారు. సైన్యాధిపతి రావత్ ఈ సందర్భంగా క్యాడెట్ల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం క్యాడెట్లను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ భారత వైమానిక దళంలో ఉన్న లక్ష్యం, సమగ్రత, సమర్థత వంటి మూడు వౌళిక విలువలను సర్వీసులో సేవలందించే సమయంలోనే కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ విడనాడ కూడదని ఉద్భోధించారు. ముఖ్యంగా ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న సవాళ్లను ధీటుగా ఎదుర్కొనేందుకు ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ సమన్వయంతో ఒకరికొకరు అన్నట్లు ఐక్యంగా పని చేసి ఆ స్ఫూర్తిని నిలబెట్టాలని అన్నారు.
దేశానికి సేవలందించేందుకు ఈరోజు ఎంతో అంకితభావంతో ఉన్న మీరంతా జీవిత కాలం జాతి రక్షణకు అదే ఒరవడిని కొనసాగిస్తూ మీ సీనియర్ల బాటలో నడవాలని రావత్ సూచించారు. కొన్ని రాష్ట్రాల్లో శాంతిభద్రతల సమస్యలు, దేశం బయట భద్రతా సవాళ్లు పెరిగినందున రక్షణ దళాలు నిత్యం అప్రమత్తంగా ఉండాలని అన్నారు. రోజురోజుకీ మారుతున్న ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానం, గ్లోబలైజేషన్‌కి అనుగుణంగా యుద్ధ విధానాల్లోనూ మార్పులు అవసరమవుతున్నాయని అన్నారు.
భారత దేశం 1.25 బిలియన్ల యువ శక్తి కలిగిన ప్రజాస్వామ్య వ్యవస్థగా ఉందని పేర్కొన్నారు. దేశం సామాజికంగా, ఆర్థికంగా శరవేగంగా ఎదుగుతోందని ఈ దశలో ఎన్నో రకాల ఒత్తిళ్లు మనపైనా ఉంటాయని అన్నారు. అయితే ఎట్టి పరిస్థితిలోనూ రక్షణ దళాలు తమ లక్ష్యాన్ని మాత్రం విడవకుండా దేశ రక్షణకే అంకితం కావాలని కోరారు. ఎయిర్‌ఫోర్స్‌లో జూనియర్ ఆఫీసర్‌గా పని చేసే గొప్ప అవకాశాన్ని పొందిన మీరంతా వృత్తిపరంగా, వ్యక్తిగతంగా ఉన్నత విలువలతో పని చేయాలని పిలుపునిచ్చారు. ప్రసంగం అనంతరం శిక్షణలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన క్యాడెట్లకు ప్రతిష్టాత్మక అవార్డులను ఆయన ప్రదానం చేశారు.
ఫ్లయింగ్ ఆఫీసర్ కుందారపు కౌషిక్ ఫ్లయింగ్ బ్రాంచ్ నుంచి అత్యుత్తమ ప్రతిభ కనబర్చినందుకు రాష్టప్రతి ప్రశంసాపత్రం, పైలెట్ కోర్సులో ప్రతిభ కనబర్చినందుకు వైమానిక దళ అధిపతి స్వార్డ్‌ను అందజేశారు. నేవిగేషన్, గ్రౌండ్ డ్యూటీ బ్రాంచీల నుంచి అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన ఫ్లయింగ్ ఆఫీసర్లు భూపేందర్ సింగ్, బి.లాస్యవదనకు రాష్టప్రతి ప్రశంసాపత్రాన్ని ప్రదానం చేశారు. ఈ పరేడ్‌లో ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ దళాలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

చిత్రాలు.. శనివారం దుండిగల్ ఎయిర్‌ఫోర్స్ అకాడమిలో నిర్వహించిన కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్‌లో
విన్యాసాలు చేస్తున్న క్యాడెట్లు. ముఖ్యఅతిథిగా హాజరై గౌరవ వందనం స్వీకరిస్తున్న దేశ సైన్యాధిపతి బిపిన్ రావత్