జాతీయ వార్తలు

బాల కార్మిక వ్యవస్థను నిర్మూలిద్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 17: కార్మికుల ఉపాధికి కనీస వయో పరిమితి, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు సంబంధించి అంతర్జాతీయ కార్మిక సంఘం రూపొందించిన రెండు తీర్మానాలను భారతదేశం ఆమోదించిందని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ ప్రకటించారు. అంతర్జాతీయ కార్మిక సంఘం సదస్సుకు హాజరై వచ్చిన అనంతరం ఆయన శనివారం విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలించేందుకు, వారి బాల్యాన్ని పునరుద్ధరించేందుకు ఎన్‌డిఏ ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోందని దత్తాత్రేయ చెప్పారు. బాల కార్మికులకు సంబంధించిన ఈ రెండు తీర్మానాలను ఆమోదించటం ద్వారా ఇంతవరకు అంతర్జాతీయ కార్మిక సంఘం ఆమోదించిన ఎనిమిది తీర్మానాల నుండి ఆరింటిని భారతదేశం ఆమోదించినట్లయిందని దత్తాత్రేయ వివరించారు. బానిస విధానాన్ని నిషేధించటం, స్ర్తి-పురుషులకు సమాన వేతనం, ఉపాధి అవకాశాలు కల్పించటంద్వారా పని హక్కు పట్ల ఎన్‌డిఏ చిత్తశుద్ధిని చాటుకున్నదని ఆయన తెలిపారు. బాల కార్మిక రహిత సమాజాన్ని నెలకొల్పేందుకు అవసరమైన అన్ని చర్య లూ తమ ప్రభుత్వం తీసుకుంటోందని ఆయన చెప్పారు.