జాతీయ వార్తలు

రాష్టప్రతి పదవికి పోటీలో లేను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 17: రాష్టప్రతి పదవికి తాను పోటీ పడుతున్నట్లు వస్తున్న వార్తలను విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ఖండించారు. సుష్మా స్వరాజ్ శనివారం విలేఖరులతో మాట్లాడుతూ రాష్టప్రతి పదవికి తాను పోటీపడటం లేదని, అవి కేవలం పుకార్లు మాత్రమేనని స్పష్టం చేశారు. బిజెపి అధినాయకత్వం రాష్టప్రతి పదవికి సుష్మా స్వరాజ్ పేరు కూడా పరిశీలిస్తున్నట్లు వార్తలు రావటం తెలిసిందే. అధికారంలో ఉన్న బిజెపి కానీ, ప్రతిపక్షంలో ఉన్న యుపిఏ దాని మిత్రపక్షాలు కానీ ఇంతవరకు రాష్టప్రతి పదవికి తమ అభ్యర్థుల పేర్లు ప్రకటించ లేదు. ఈ నేపథ్యంలో రాష్టప్రతి పదవికి పలువురు పోటీ పడుతున్నారని వార్తలు వచ్చాయి. లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, జార్ఖండ్ గవర్నర్, గిరిజన నాయకురాలు ద్రౌపదీ ముర్ము, సుష్మా స్వరాజ్, మెట్రో రైలు శ్రీ్ధరన్ తదితరుల పేర్లు అధికార పక్షం నుండి వినిపిస్తే, ప్రతిపక్షం నుండి మాజీ దౌత్యవేత్త, మహాత్మా గాంధీ మనుమడు గోపాలకృష్ణ గాంధీ, జెడి(యు) సీనియర్ నాయకుడు శరద్ యాదవ్, ఎన్‌సిపి అధినాయకుడు శరద్ పవార్ తదితరుల పేర్లు చర్చకు వచ్చాయి. ఈ నేపథ్యంలో సుష్మా స్వరాజ్ రాష్టప్రతి పదవికి తాను పోటీ పడటం లేదని స్పష్టం చేశారు.
ఇదిలాఉంటే బిజెపి త్రిసభ్య కమిటీ సభ్యులు రాజ్‌నాథ్ సింగ్, వెంకయ్యనాయుడు శనివారం మహారాష్ట్ర రాజధాని ముంబాయికి వెళ్లి ఎన్‌సిపి అధినాయకుడు శరద్ పవార్‌తో రాష్టప్రతి ఎంపిక గురించి సమాలోచనలు జరిపారు. జూలై 17 రాష్టప్రతి ఎన్నిక జరుగుతుంది. 20 ఓట్ల లెక్కింపు ఉంటుంది. రాష్టప్రతి ఎన్నిక నోటిఫికేషన్ ప్రకారం నామినేషన్ల దాఖలుకు ఈ నెల 28 ఆఖరు తేదీ. నామినేషన్లు ఉపసంహణ గడువు జూలై 1.

చిత్రం.. సుష్మా స్వరాజ్