జాతీయ వార్తలు

నాణ్యతా ప్రమాణాలే కొలమానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 18: కేంద్రం నిధులు పొందు తూ బాగా పని చేస్తున్న విద్యాసంస్థలకు మరిన్ని నిధులు, పాలనాపరంగా మరింత స్వయంప్రతిపత్తి లభిస్తుందని నీతి ఆయోగ్ తెలిపింది. అయితే అంత బాగా పని చేయని ఉన్నత విద్యా సంస్థలపై ప్రభుత్వం నిఘా పెట్టి ఉంచుతుందని, నిర్ణీత సమయంలో వాటి పని తీరు మెరుగపడని పక్షంలో వాటికి అందించే ఆర్థిక సహాయంపై పునస్సమీక్ష జరపడం జరుగుతుందని కూడా స్పష్టం చేసింది. ఉన్నతవిద్యా సంస్థల్లో తీసుకోవలసిన సంస్కరణ చర్యలను సూచించే బాధ్యతను ప్రధానమంత్రి కార్యాలయం నీతి ఆయోగ్‌కు అప్పగించిన విషయం తెలిసిందే. ‘ ఇప్పుడు ఉన్నత విద్యా సంస్థల దృష్టి అంతా నాణ్యతపైనే ఉండాలి.. ఒక విద్యా సంస్థ ఎలాంటి నాణ్యతాప్రమాణాలు సాధించింది, ఎంతమంది పిహెచ్‌డిలను పంపించింది లాంటి వాటి ఆధారంగానే ఉన్నత విద్యా సంస్థల పని తీరును అంచనా వేయడం జరుగుతుందని నీతి ఆయోగ్ స్పష్టంగా చెప్పడం జరిగిందని నీతి ఆయోగ్ సభ్యుడు వికె సారస్వత్ చెప్పారు. విద్యా సంస్థలకోసం మూడంచెల అటానమీ వ్యవస్థను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం అనుకుంటోందని డిఆర్‌డిఓ మాజీ చీఫ్ అయిన సారస్వత్ చెప్పారు. ‘పని తీరు బాగా ఉన్న విద్యాసంస్థలకు పాలనాపరంగా మరింత స్వయంప్రతిపత్తి, మరింత ఆర్థిక మద్దతు లభిస్తుంది. ఒక వేళ ఆ సంస్థలు మరిన్ని పరిశోధనా సంస్థలను ప్రారంభించాలనుకుంటే ప్రభుత్వం ఆర్థిక మద్దతు అందిస్తుంది’ అని ఆయన చెప్పారు. ఇక రెండో దశలో పని తీరు అంతబాగా లేని విద్యాసంస్థలపై నిఘా ఉంటుంది కానీ ఆర్థిక సాయం మాత్రం అందుతుందని ఆయన చెప్పారు. కాగా పనితీరు నాసిగా ఉండే విద్యా సంస్థలు ప్రభుత్వ కంట్రోల్‌లోనే ఉంటాయని, అయితే అవి తమ పని తీరును మెరుగుపర్చుకోని పక్షంలో వాటికి ఆర్థిక మద్దతును సమీక్షించడం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. ఉన్నతవిద్యా రంగంలో సంస్కరణల ప్యాకేజికి నీతి ఆయోగ్ తుది మెరుగులు దిద్దుతున్న నేపథ్యంలో సారస్వత్ ప్రకటన ప్రాధాన్యతను సంతరించుకుంది.