జాతీయ వార్తలు

జీఎస్టీ భారం రూ.11వేల కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 18: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పథకాల కాంట్ట్రాకులను వస్తు సేవల పన్ను (జీఎస్టీ) నుంచి మినహాయించాలని కేంద్రానికి మరోసారి తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఆదివారం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అధ్యక్షతన విజ్ఞాన్ భవన్‌లో జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశానికి తెలంగాణ తరపున ఐటి మంత్రి కె.తారకరామరావు హాజరయ్యారు. అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ ప్రధానంగా ఆరు అంశాలను కౌన్సిల్ దృష్టికి తీసుకొచ్చామన్నారు. జిఎస్టీ కారణంగా రూ.40వేల కోట్లతో చేపడుతున్న మిషన్ భగీరథ ప్రాజెక్టుపై రూ.2వేల కోట్ల అదనపు భారం పడుతుందన్నారు. చాలా రాష్ట్రాలు ఈ ప్రాజెక్టును అదర్శంగా తీసుకుని అమలుచేస్తున్న నేపథ్యంలో పన్నులతో తెలంగాణను ఇబ్బంది పెట్టడం సరికాదని కేంద్ర ఆర్థిక మంత్రికి వివరించినట్టు చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన నీటి పారుదల ప్రాజెక్టులలో ఒక లక్షా ఇరవై వేల కోట్ల విలువైన పనులు ప్రస్తుతం జరుగుతున్నాయని, వీటిపై జీఎస్టీ విధించడంవల్ల రాష్ట్రానికి రూ.8వేల కోట్ల అదనపు భారం పడుతున్నట్టు చెప్పారు. పేదలకు గృహ నిర్మాణ పథకంకోసం రూ.18,000 కోట్లతో పనులను చెపడితే జీఎస్టీ మూలంగా రూ.6,800 కోట్ల అదనపు భారం పడుతున్నట్టు వెల్లడించారు. ఆ విధంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన నీటి ప్రాజెక్టులు, పేదల గృహనిర్మాణం జీఎస్టీ జాబితాలో చేర్చడంవల్ల తెలంగాణ రాష్ట్రంపై అదనంగా రూ.11వేల కోట్ల భారం పడుతోందన్నారు. ఈ అదనపు భారన్ని సవరించాలని, కేంద్రం స్పందించాలని కోరామన్నారు. దీనిపై అరుణ్ జైట్లీ పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని కోరినట్టు కెటిఆర్ చెప్పారు. తెలంగాణలో 2వేల వరకు చిన్న, మధ్యతరహా గ్రానైట్ పరిశ్రమలు ఉన్నాయని, 28శాతంగా ఉన్న ఈ స్లాబ్‌ను పరిశీలించి 12-18 శాతం స్లాబ్‌లోకి చేర్చాలని కోరామన్నారు. చేనేత రంగంపై జీఎస్టీని సవరించాలని కోరినట్టు చెప్పారు.