జాతీయ వార్తలు

‘గాల్లో’నే కేరింతలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 18: భూమికి 35వేల అడుగుల ఎత్తులో ఓ శిశువు జన్మించింది. పుట్టడంతోనే జెట్ ఎయిర్‌వేస్‌లో జీవితాంతం ఉచితంగా ప్రయాణం చేసే చాన్స్‌నూ కొట్టేసింది!సౌదీ అరేబియా నుంచి భారత్ వస్తున్న జెట్‌ఎయిర్‌వేస్ విమానంలో ఓ గర్బిణి ఎక్కింది. విమానం అరేబియా సముద్రం మీద నుంచి వెళుతూండగా నొప్పులు వచ్చాయి. ‘మీలో ఎవరైనా వైద్యులు లేదా నర్సులు ఉంటే రండి’అంటూ విమాన సిబ్బంది అనౌన్స్ చేశారు. కేరళ వెళుతున్న విల్సన్ అనే నర్సు ముందుకొచ్చి సహకరించింది. అందరి సాయంతో విమానంలోనే శిశువు జన్మించింది. అప్పటికే అత్యవసరంగా ముంబయికి విమానాన్ని మళ్లించారు. అక్కడ దిగిన వెంటనే తల్లీబిడ్డలను ఆసుపత్రికి తరలించారు. ఇద్దరూ క్షేమంగా ఉన్నట్టు వైద్యులు ప్రకటించారు.
తమ విమానంలో జన్మించిన తొలి శిశువు ఇదే కాబట్టి ఈ చిన్నారి తన జీవితాంతం తమ విమానంలో ఉచితంగా ప్రయాణం చేసేందుకు వీలుగా పాస్ ఇస్తున్నామని జెట్ ఎయిర్‌వేస్ ప్రకటించింది. 162మంది ప్రయాణికులతో ఉన్న ఈ విమానం శిశు జననానంతరం 90 నిముషాల ఆలస్యంగా కొచ్చికి చేరుకుంది.