జాతీయ వార్తలు

ఈసారీ పోటీ తప్పదా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 18: వచ్చే నెల జరగబోయే రాష్టప్రతి ఎన్నికకోసం ఏకాభిప్రాయాన్ని సాధించడం కోసం రాజకీయ పార్టీలు ఎడతెరిపి లేకుండా సమాలోచనలు జరుపుతున్నప్పటికీ దేశంలో ఇప్పటివరకు జరిగిన అన్ని రాష్టప్రతి ఎన్నికల్లోను ఒక్క సారి తప్ప అన్ని సార్లు పోటీ అనివార్యంగా మారినట్లు చరిత్ర చెబుతోంది. వీటిలో కొన్ని గట్టి పోటీలు ఉంటే మరికొన్ని ఏకపక్షంగా జరిగినవీ ఉన్నాయి. ఇప్పటివరకు జరిగిన ఎన్నికలను గమినించినట్లయితే జూలై 17న జరిగే 15వ రాష్టప్రతి ఎన్నికకు కూడా పోటీ ఉండడం ఖాయంగా కనిపిస్తోంది. దేశంలో ఇంతవరకు 14 రాష్టప్రతి ఎన్నికలు జరగ్గా ఒకే ఒకసారి మాత్రమే ఏకగ్రీవ ఎన్నిక జరిగింది. ఆ ఘనత నీలం సంజీవరెడ్డికి దక్కింది. అప్పటి రాష్టప్రతి ఫక్రుద్దీన్ అహ్మద్ ఆకస్మిక మృతి కారణంగా జరిగిన ఎన్నికల్లో 37 మంది నామినేషన్లు దాఖలు చేయగా, 36 నామినేషన్లను తిరస్కరించడం జరిగింది. దీంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఇక మిగతా అన్ని ఎన్నికల్లో పోటీ ఉన్నప్పటికీ రెండు మూడు సందర్భాల్లో తప్పితే మిగతావన్నీ కూడా నామ్‌కే వాస్తే పోటీలే కావడం గమనార్హం. వీటన్నిటిలోకి 1969 ఆగస్టు 6న వివి గిరి, నీలం సంజీవరెడ్డిల మధ్య జరిగిన పోటీని ప్రధానమైనదిగా చెప్పుకోవాలి. అంతర్గత కుమ్ములాటల కారణంగా కాంగ్రెస్ పార్టీ రెండుగా చీలిపోయిన తరుణంలో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ మద్దతుతో పోటీ చేసిన వివి గిరికి, సిండికేట్‌గా పిలవబడిన ఆమె వ్యతిరేక వర్గమంతా సమర్థించిన సంజీవ రెడ్డికి మధ్య నువ్వా- నేనా అన్నట్లుగా పోటీ జరిగిన ఆ ఎన్నికల్లో వివి గిరి కేవలం 87,967 ఓట్ల స్వల్ప ఆధిక్యతతో గెలుపొందారు. రాష్టప్రతి ఎన్నికల చరిత్రలో లభించిన అతి తక్కువ మెజారిటీ కూడా ఇదే. 1967 మే6న జాకీర్ హుస్సేన్, కోటా సుబ్బారావుమధ్య జరిగిన పోటీ, 1997 జూలై 14న కెఆర్ నారాయణన్, టిఎన్ శేషన్‌ల మధ్య, అలాగే 2002లో ఎన్డీఏ అభ్యర్థి ఎపిజె అబ్దుల్ కలామ్, లక్ష్మీ సెహగల్, 2007 జూలై 19న యుపిఏ అభ్యర్థి ప్రతిభా పాటిల్, ప్రతిపక్షాల అభ్యర్థి భైరాన్ సింగ్ షెకావత్‌ల మధ్య జరిగిన పోటీలు మాత్రమే చెప్పుకోదగ్గవి. మిగిలినవన్నీ కూడా నామమాత్రపు పోటీలనే చెప్పాలి. ఇక చివరగా 2012 జూలై 20న జరిగిన ఎన్నికల్లో యుపిఏ అభ్యర్థి ప్రణబ్ ముఖర్జీ ఎన్డీఏ అభ్యర్థి పిఏ సంగ్మాపై సునాయాసంగా విజయం సాధించారు.