జాతీయ వార్తలు

ఆరోగ్యసేవలు అధ్వాన్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉడిపి, జూన్ 18: దేశంలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సదుపాయాలు, సిమ్బంది కొరత పట్ల రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ విచారం వ్యక్తం చేస్తూ, ఈ అంతరాన్ని తగ్గించడానికి ఈ రంగంలో మరిన్ని పెట్టుబడులు పెడతారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కర్నాటకలోని ఉడిపిలో ఆదివారం ఒక సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి శంకుస్థాపన చేసిన అనంతరం రాష్టప్రతి మాట్లాడుతూ పెట్టుబడులు పెంచడం ద్వారా వైద్య రంగంలో మెరుగైన వౌలిక సదుపాయాలను కల్పించడం వల్ల అనేక రోగాలను నయం చేయవచ్చని, అయితే ఈ విషయంలో ఇప్పటికీ భారీ లోటు ఉందని అన్నారు. దేశంలో కేవలం వైద్య సేవలు అందుబాటులో ఉండడం ఒక్కటే కాక భరించగలిగే స్థితిలో ఉండడం అవసరమని అన్నారు. ప్రతి వెయ్యి మందికి ఒక డాక్టర్ ఉండాలని అంతర్జాతీయ ప్రమాణాలు చెబుతుండగా, మన దేశంలో 1700 మందికి ఒక డాక్టర్ ఉన్నారని రాష్టప్రతి అంటూ, ఏ సభ్య సమాజం కూడా దీన్ని సహించజాలదన్నారు. గ్రామీణ భారతంలో పరిస్థితి మరింత ఘోరంగా ఉందని, ఇక్కడ సర్జన్ల కొరత 83 శాతానికి పైగా ఉందని ఆయన చెప్పారు. 2015 లెక్కల ప్రకారం దేశం మొత్తంమీద సర్జన్ల కొరత 81.2 శాతంగా ఉందని రాష్టప్రతి అన్నారు. ఈ సమస్యలను అదిగమించడానికి రాష్టప్రతి కొన్ని సూచనలు కూడా చేశారు. ఈ పరిస్థితిని అధిగమించాలంటే మరిన్ని వైద్య కళావాలను ఏర్పాటు చేయడంతో పాటుగా, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో కార్పొరేట్ రంగం సేవలను మరింతగా తీసుకోవాలని అన్నారు. వాణిజ్యపరమైన, లాభాలే లక్ష్యంగా ఉండే ఆరోగ్య వ్యవస్థ కావాలా లేక సమాజంలోని సామాజిక- ఆర్థిక పరిస్థితులకు తగిన వైద్య రంగంలో ఉండాలో ఆలోచించాలని ఆయన ప్రజలను కోరారు. కాగా, డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బందిపై దాడులు చేయడాన్ని, ఆస్పత్రుల్లో విధ్వంసకాండకు దిగడాన్ని రాష్టప్రతి ఖండించారు.‘డాక్టర్లను విశ్వసించకపోతే ఇంకెవర్ని విశ్వసిస్తారు?’ అని ఆయన ప్రశ్నించారు.
రాష్టప్రతి పట్టణంలోని 800 ఏళ్ల నాటి సుప్రసిద్ధ శ్రీకృష్ణ ఆలయాన్ని, ఇక్కడికి అరవై కిలోమీటర్ల దూరంలోని కొల్లూరు మూకాంబిక ఆలయాన్ని కూడా సందర్శించారు.

చిత్రం.. ఆదివారం ఉడిపిలో రాష్టప్రతి ప్రణబ్‌కు జ్ఞాపికను అందిస్తున్న ఉడిపి పెజావర్ మఠంపీఠాధిపతి