జాతీయ వార్తలు

యోగ ముద్రకు ముస్తాబు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 18:అంతర్జాతీయ యోగా దినోత్సవానికి భారత్‌లోని అన్ని రాష్ట్రాలతో పాటు ప్రపంచ దేశాలూ సంసిద్ధమవుతున్నాయి. ఈ నెల 21 అత్యంత ప్రతిష్టాత్మక రీతిలో యోగా దినోత్సవాన్ని నిర్వహించుకునేందుకు దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందుకు సన్నద్ధంగా అనేక రాష్ట్రాల్లో విస్తృత స్థాయి రిహార్సల్స్ నిర్వహిస్తున్నారు. భారత యోగాకు అంతర్జాతీయ గుర్తింపు వచ్చిన నేపథ్యంలో యోగా దినోత్సవాన్ని అత్యంత ఘనంగా, విస్తృత స్థాయి ప్రజా ప్రమేయంతో నిర్వహించేందుకు ప్రభుత్వం గట్టి ఏర్పాట్లే చేస్తోంది. ఈ నెల 21న లక్నోలోని రమాబాయి అంబేద్కర్ మైదాన్‌లో జరగనున్న మూడవ అంతర్జాతీయ యోగా దినోత్సవం కోసం చివరి నిమిషం ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనే ఈ కార్యక్రమంలో దాదాపు 55 వేల మంది పాల్గొని యోగాసనాలు నిర్వహిస్తారని భావిస్తున్నారు. కార్యక్రమం జరిగే రమాబాయి అంబేద్కర్ మైదానంలోపల, మైదానం చుట్టూ విస్తృతమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. కమాండోలతో పాటుగా పారా మిలిటరీ బలగాలు మైదానంలోపల, చుట్టుపక్కల గట్టి నిఘా పెట్టనున్నారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ సోమవారం అంతర్జాతీయ యోగా దినోత్సవం జరిగే వేదిక వద్ద జరిగే రిహార్సల్‌లో పాల్గొనడమే కాకుండా అన్ని ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యంగా హైవేలపై ధర్నాకు భారత్ కిసాన్ యూనియన్ (బికెయు) పిలుపుఇచ్చిన దృష్ట్యా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవలసిందిగా లక్నో చుట్టుపక్కల జిల్లాల ఎస్పీలను అప్రమత్తం చేసినట్లు పోలీసు ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. కాగా, రైతుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఉదాసీన వైఖరికి నిరసనగా తమ పార్టీ ఆ రోజు రాష్టవ్య్రాప్తంగా అన్ని పట్టణాల్లోని వీథుల్లో తమ పార్టీ కార్యకర్తలు యోగా నిర్వహిస్తారని బికెయు ప్రతినిధి రాకేష్ తికత్ చెప్పారు. తమ కార్యకర్తలు శీర్షాసనాలు వేస్తారని బికెయు ప్రధాన కార్యదర్శి ధర్మేంద్ర మాలిక్ చెప్పారు.
యోగా దినోత్సవం కార్యక్రమంలో పాల్గొనడం కోసం రాష్ట్ర ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రులు అఖిలేష్ యాదవ్(ఎస్పీ), మాయావతి (బిఎస్పీ) సహా వివిధ పార్టీలకు చెందిన సీనియర్ రాజకీయ నాయకులకు ఆహ్వానాలు పంపించింది. కాగా, అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని వివిధ జైళ్లలో ఉన్న దాదాపు 92 వేల మంది ఖైదీలు కూడా యోగా కార్యక్రమాల్లో పాల్గొంటారని రాష్ట్ర జైళ్ల శాఖ మంత్రి జైకుమార్ సింగ్ చెప్పారు.

చిత్రాలు.. అంతర్జాతీయ యోగా దినోత్సవ సన్నద్దంగా అహ్మదాబాద్‌లో రిహార్సల్స్ చేయస్తున్న యోగా గురువు రామ్‌దేవ్‌బాబా
*ఢిల్లీ అంగన్‌వాడి పిల్లలతో కేంద్రమంత్రి మేనకాగాంధీ యోగాసనం