జాతీయ వార్తలు

జెఎన్‌యుకు సిబిఐ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 19: విద్యార్థి నాయకుడు నజీబ్ అహ్మద్ అదృశ్యం కేసులో సిబిఐ బృందం సోమవారం మరోసారి జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీకి వెళ్లింది. 2016 అక్టోబర్ 16న హాస్టల్ గదినుంచి అదృశ్యమైన నజీబ్ జాడ ఇప్పటికీ తెలియలేదు. మహి మాధవి హాస్టల్‌లో ఏబివిపి విద్యార్థులకు, నజీబ్ అహ్మద్‌కు మధ్య గొడవ జరిగిందని, ఆ తరువాతే అతను అదృశ్యమయ్యాడని అరోపణలు రావడంతో సిబిఐ బృందం జెఎన్‌యు క్యాంపస్‌ను సందర్శించి విద్యార్థులను, ఉపాధ్యాయులను విచారించింది. నజీబ్ తల్లి ఫాతిమా నఫీస్ ఇటీవలే తన కుమారుడి అదృశ్యం కేసుపై సిబిఐ అధికారులను కలిశారు. హాస్టల్ నుంచి నజీబ్ అదృశ్యానికి ముందు వరుసగా జరిగిన ఘటనల వివరాలను ఆమె అధికారులకు అందించారు. 2016 అక్టోబర్ 13న సెలవుల నుంచి నజీబ్ హాస్టల్‌కు తిరిగి వచ్చారని అక్టోబర్ 15-16 రాత్రి అతను ఒక కార్యక్రమంలో జోక్యం చేసుకున్నాడని ఆమె పేర్కొన్నారు. నజీబ్ తనకు ఫోన్ చేసి ఏదో జరగరానిది జరుగుతోందని చెప్పినట్లు ఫాతిమా అధికారులకు వెల్లడించారు. ఒక గొడవలో నజీబ్ గాయపడినట్లు అతని రూమ్‌మేట్ తనకు చెప్పాడని కూడా ఆమె అధికారులకు వెల్లడించారు. ఆ వెంటనే తాను ఉత్తరప్రదేశ్‌లోని బులంద్ షెహర్ నుంచి బయలుదేరి ఢిల్లీకి వచ్చానని, ఒక హోటల్‌లో కలవాలని నజీబ్‌కు ఫోన్ చేసి చెప్పినట్లు ఆమె వివరించారు. కానీ అతను కలవలేదని, హాస్టల్‌లో అతను ఉంటున్న 106 గదికి వెళ్లగా అతని జాడ తెలియలేదని ఆమె చెప్పారు. ఈ వ్యవహారంపై సిబిఐ విచారణ జరిపించాలని ఢిల్లీ హైకోర్టు మే 16న ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ ఆదేశాల ప్రకారం ఇప్పటికే సిబిఐ అధికారులు జెఎన్‌యుకు వెళ్లి వచ్చారు. తాజాగా సోమవారం కూడా క్యాంపస్‌కు వెళ్లి అనుమానిత విద్యార్థులను విచారించారు.