జాతీయ వార్తలు

రైతు రుణాల మాఫీ ప్రతిపాదన లేదు: జైట్లీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 20: వ్యవసాయ రుణాలను మాఫీ చేసేందుకు సంబంధించి ఎలాంటి ప్రతిపాదననూ కేంద్రం పరిశీలించడం లేదని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. పంజాబ్ ప్రభుత్వం రాష్ట్రంలోని పది లక్షల మంది రైతుల రుణాలను మాఫీ చేసిన ఒక రోజు తర్వాత జైట్లీ ఈ విషయం చెప్పడం గమనార్హం. ‘అలాంటి ప్రతిపాదన ఏదీ లేదు. ఎఫ్‌ఆర్‌ఎంబి చట్టం, ద్రవ్య లోటు లక్ష్యాలు మాకు ఉన్నాయి. వాటికే కట్టుబడి ఉండాలని మేము అనుకుంటున్నాం’ అని మంగళవారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడుతూ జైట్లీ చెప్పారు. 2017-18 ఆర్థిక సంవత్సరం కేంద్రం బడ్జెట్‌లో ద్రవ్య లోటును అంతకు ముందు ఆర్థిక సంవత్సరంలో ఉండిన 3.5 శాతంనుంచి 3.2 శాతానికి తగ్గించాలని ప్రతిపాదించిన విషయం తెలిసిందే. రాబోయే మూడేళ్లలో అంటే 2020 మార్చి నాటికి బడ్జెట్ లోటును జిడిపిలో 3 శాతానికి పరిమితం చేయాలని మాజీ రెవిన్యూ కార్యదర్శి ఎన్‌కె సింగ్ నేతృత్వంలోని ఆర్థిక జవాబుదారీ, బడ్జెట్ నిర్వహణ (ఎఫ్‌ఆర్‌బిఎం) కమిటీ సిఫార్సు చేసింది. అంతేకాదు 2022-23 ఆర్థిక సంవత్సరం నాటికి దీన్ని 2.5 శాతానికి తగ్గించాలని కూడా ఆ కమిటీ సూచించింది. ఈ ఏడాది రబీ సీజన్‌లో పంటలు పుష్కలంగా పండినప్పటికీ దేశీ మార్కెట్‌తో పాటుగా అంతర్జాతీయంగా కూడా ఆహారోత్పత్తుల ధరలు గణనీయంగా పడిపోవడంతో రైతులు సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నారు. దీంతో తాము పండించిన పంటలకు అధిక మద్దతు ఇవ్వాలని, వ్యవసాయ రుణాలను మాఫీ చేయాలని కోరుతూ పలు రాష్ట్రాల్లో రైతులు ఆందోళన చేస్తుండడం తెలిసిందే.

చిత్రం.. మంగళవారం ఢిల్లీలో విలేఖరులతో మాట్లాడుతున్న కేంద్రమంత్రి జైట్లీ