ఆంధ్రప్రదేశ్‌

పిఎస్‌ఎల్‌వి-సి 38కి రేపు కౌంట్‌డౌన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూళ్లూరుపేట, జూన్ 20: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో భూ దూర పరిశీలన ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపడానికి సర్వం సిద్ధం చేసింది. ఈ నెల 23న నెల్లూరు జిల్లాలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీష్ థావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి పిఎస్‌ఎల్‌వి-సి 38 రాకెట్ ప్రయోగానికి శాస్తవ్రేత్తలు ఏర్పాట్లు పూర్తిచేశారు. ఈ రాకెట్ ద్వారా మనదేశానికి చెందిన కార్టోశాట్-2 ఇ ఉపగ్రహం, తమిళనాడు నూర్ ఇస్లాం విశ్వ విద్యాలయం విద్యార్థులు రూపొందించిన మరో చిన్న ఉపగ్రహంతో పాటు 14దేశాలకు చెందిన మరో 29 ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. రాకెట్‌ను నాలుగు దశల అనుసంధానంతో పాటు రాకెట్ శిఖర భాగాన ఉపగ్రహాలను అమర్చే ప్రక్రియను శాస్తవ్రేత్తలు పూర్తిచేసి ప్రయోగానికి సిద్ధం చేశారు. ప్రయోగానికి సంబంధించిన మిషన్ రెడీనెస్ రివ్యూ సమావేశం బుధవారం షార్‌లోని బ్రహ్మప్రకాష్ హాలులో డాక్టర్ బిఎన్.సురేష్ అధ్యక్షతన జరగనుంది. కౌంట్‌డౌన్ ప్రయోగానికి 24గంటల ముందు ప్రారంభించేందుకు శాస్తవ్రేత్తలు సన్నాహాలు చేస్తున్నారు. బుధవారం ఉదయం రాకెట్ రిహార్సల్ నిర్వహించినంతరం ఫ్రీ కౌంట్‌డౌన్‌ను నిర్వహించనున్నారు.