జాతీయ వార్తలు

మోదీ లక్నో పర్యటనకు ముందు 22 మంది అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, జూన్ 20: ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం లక్నో చేరుకోవడానికి కొద్ది గంటల ముందు పోలీసులు 22 మందిని ముందుజాగ్రత్త చర్యగా అదుపులోకి తీసుకున్నారు. ప్రధాని పర్యటన సందర్భంగా ఆయన కాన్వాయ్‌ని అడ్డుకోవడం, లేదా ఇతర రకాల గొడవలు సృష్టిస్తారన్న అనుమానంతో తాము 22 మందిని అదుపులోకి తీసుకున్నట్లు సీనియర్ పోలీసు సూపరింటెండెంట్ దీపక్ కుమార్ చెప్పారు. అరెస్టయిన వారిలో సమాజ్‌వాది పార్టీకి చెందిన కొంతమంది యువ నేతలు ఉన్నారు. ఈ నెల 7న ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ లక్నో యూనివర్శిటీని సందర్శించినప్పుడు పలువురు విద్యార్థులు ఆయన వాహన శ్రేణిని అడ్డుకోవడమే కాకుండా ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేయడం, నల్లజెండాలు ప్రదర్శించారు. యూనివర్శిటీలో ఛత్రపతి శివాజీపై జరిగిన ఓ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యేందుకు ముఖ్యమంత్రి వెళ్తున్నప్పుడు సమాజ్‌వాది పార్టీ ‘్ఛత్ర సభ (విద్యార్థి విభాగం), ఇతర సంఘాలకు చెందిన విద్యార్థులు రోడ్డుపై బైఠాయించి నల్ల జెండాలను ప్రదర్శించారు. ఆందోళనకారులను అదుపు చేయడానికి అప్పుడు పోలీసులు చాలా కష్టపడాల్సి వచ్చింది. గత ఏడాది జనవరిలో ప్రధాని మోదీ లక్నోలోని బిఆర్ అంబేద్కర్ యూనివర్శిటీని సందర్శించినప్పుడు సైతం ఆయన ప్రసంగించడం ప్రారంభించగానే విద్యార్థులు గొడవ చేయడం ప్రారంభించారు. అయితే ఆందోళన చేస్తున్న విద్యార్థులను పోలీసులు బలవంతంగా ఆడిటోరియంనుంచి బైటికి పంపించి వేశారు. ఈ సంఘటనలను దృష్టిలో పెట్టుకుని భద్రతా ఏజన్సీలు ఈ సారి ప్రధాని రెండు రోజుల పర్యటన సందర్భంగా విస్తృతమైన భద్రతా ఏర్పాట్లు చేశాయి.

చిత్రం.. మంగళవారం లక్నోలో ప్రధానమంత్రి అవాస్ యోజనకింద ఎంపికైన మహిళకు పత్రాన్ని అందజేస్తున్న నరేంద్ర మోదీ.
చిత్రంలో యుపి సిఎం యోగి ఆదిత్యనాథ్ కూడా ఉన్నారు.