జాతీయ వార్తలు

జస్టిస్ కర్ణన్‌కు వైద్య పరీక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, జూన్ 22: కోర్టు ధిక్కరణకు పాల్పడినందుకు అరెస్టయిన కలకత్తా హైకోర్టు మాజీ జడ్జి సిఎస్ కర్ణన్ ఆరోగ్య పరిస్థితిని నిర్ధారించుకోవడానికి గురువారం మరోసారి ఆస్పత్రికి తీసుకెళ్లారు. కర్ణన్ బాగాలేరని, బలహీనంగా ఉన్నట్లు కనిపిస్తున్నారని, అందుకే ఈ రోజు మరోసారి ప్రభుత్వ అధీనంలోని ఎస్‌ఎస్‌కెఎం ఆస్పత్రికి తీసుకెళ్లామని ప్రస్తుతం కర్ణన్ ఉంటున్న ప్రెసిడెన్సీ జైలు అధికారి ఒకరు పిటిఐకి చెప్పారు. ఛాతీలో నొప్పిగా ఉందని చెప్పడంతో 62 ఏళ్ల కర్ణన్‌ను జైలు అధికారులు నిన్న రాత్రి పరీక్షలకోసం ఇదే ఆస్పత్రికి తీసుకెళ్లిన విషయం తెలిసిందే. అయితే నిన్న రాత్రి కొన్ని పరీక్షలు జరపలేదని, అందుకే ఈ రోజు మరోసారి ఆస్పత్రికి తీసుకెళ్లామని జైలు అధికారి తెలిపారు. కాగా, జైల్లో కర్ణన్‌ను మిగతా ఖైదీల మాదిరిగానే చూస్తున్నామని, ఆయనకు ప్రత్యేకంగా ఏమీ ఏర్పాట్లు చేయలేదని కూడా ఆ అధికారి చెప్పారు. నిన్న రాత్రి కర్ణన్ జైలు ఆస్పత్రిలోనే గడిపారని, డాక్టర్లు నిర్దేశించిన ఆహారానే్న తీసుకున్నారని ఆయన తెలిపారు. కర్ణన్‌ను ఆస్పత్రిలో చేర్చే అవకాశం ఉందా అని అడగ్గా, అదంతా డాక్టర్లు చెప్పేదానిపై ఆధారపడి ఉంటుందని ఆయన అంటూ, ఏమయినా ఆయన వయసును కూడా దృష్టిలో పెట్టుకోవలసిన అవసరం ఉందన్నారు.