జాతీయ వార్తలు

రైతు రుణమాఫీ తలకు మించిన భారమే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 22: దేశంలో వివిధ ప్రభుత్వాలు ప్రకటిస్తున్న రైతు రుణమాఫీ పథకాలు బ్యాంకులపై విపరీతపై భారాన్ని మోపనున్నాయి. 1.5 నుంచి 2.3 ట్రిలియన్ల రూపాయల వరకూ అవసరం అవుతాయి. బిజెపి పాలిత రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన రుణమాఫీ పథకాల కింద బ్యాంకుల్లో పేరుకుపోయిన రుణాలు 30 నుంచి 40 శాతం మాఫీ అవుతాయి. పంజాబ్ ప్రభుత్వం కూడా 15 శాతం బకాయిలు మాఫీ చేయనుంది. ఈ నేపథ్యంలో రుణమాఫీ పథకాలు బ్యాంకులపై ప్రతికూల ప్రభావం చూపుతాయని ఓ సర్వేలో వెల్లడైంది. తాజాగా కర్నాటక ప్రభుత్వ రైతులకు రుణమాఫీ ప్రకటించింది. మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, హర్యానా రాష్ట్రాలూ రుణమాఫీ ప్రకటించే అవకాశం ఉంది. ఇదే ధోరణి కొనసాగుతూ పోతే జిడిపిపైనా తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉందని ఎడెల్‌వెయిస్ అనే సంస్థ హెచ్చరించింది. బ్యాంకుల్లో పెండింగ్‌లో ఉన్న వ్యవసాయ రుణాల్లో ఇరవై నుంచి 30 శాతం బకాయిలు మాఫీ అయినా 1.5 నుంచి 2.3 ట్రిలియన్ రూపాయల భారం పడుతుందని నివేదికలో స్పష్టం చేశారు.