జాతీయ వార్తలు

మళ్లీ ఎన్డీఏలోకి వెళ్లే ప్రశే్న లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాట్నా, జూన్ 22: మళ్లీ ఎన్డీఏలోకి వెళ్లే ప్రసక్తే లేదని, సమైక్య ప్రతిపక్ష కూటమిలో భాగస్వామిగానే కొనసాగుతామని జెడి(యు) గురువారం స్పష్టం చేసింది. రాష్టప్రతి పదవికి ఎన్డీఏ అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్‌కు మద్దతు ఇవ్వనున్నట్లు ప్రకటించిన ఒక రోజు తర్వాత నితీశ్ కుమార్ నేతృత్వంలోని జెడి(యు) ఈ ప్రకటన చేయడం గమనార్హం. ‘కోవింద్ అభ్యర్థిత్వానికి మద్దతు ఇవ్వాలన్న నిర్ణయం అరుదైన సంఘటన మాత్రమే.. మేము మళ్లీ ఎన్డీఏ కూటమిలోకి వెళ్లే ప్రసక్తే లేదు’ అని జెడి(యు) జాతీయ అధికార ప్రతినిధి కెసి త్యాగి ఢిల్లీనుంచి ఫోన్‌లో పిటిఐకి చెప్పారు. బిహార్ మాజీ గవర్నర్ అయిన కోవింద్ రాష్ట్ర ప్రభుత్వంతో సానుకూలమైన, ఘర్షణ రహిత వైఖరిని కొనసాగించారని త్యాగి చెప్పారు. రాష్ట్ర గవర్నర్‌గా తన రెండేళ్ల పదవీ కాలంలో కోవింద్ ఎంతో హుందాగా, సమతుల్యంగా వ్యవహరించారని, ఆయన వ్యవహార శైలిపట్ల ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కూడా ఎంతో సంతృప్తి చెందారని, అందుకే రాష్టప్రతి పదవికి ఆయన అభ్యర్థిత్వానికి మద్దతు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. ఈ నెల 4న చెన్నైలో డిఎంకె వ్యవస్థాపకుడు ఎం కరుణానిధి 94వ పుట్టిన రోజు సందర్భంగా జెడి(యు) జాతీయ అధ్యక్షుడు కూడా అయిన నితీశ్ కుమార్, సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి రాష్టప్రతి పదవికి ప్రతిపక్షాల అభ్యర్థిగా పశ్చిమ బెంగాల్ మాజీ గవర్నర్ గోపాలకృష్ణ గాంధీ పేరును చర్చించారని, ఆ ప్రతిపాదన అలాగే కొనసాగుతూ ఉండగానే కోవింద్ అభ్యర్థిత్వాన్ని ప్రకటించి ఎన్డీఏ అందరినీ ఆశ్చర్యంలో పడేసిందని త్యాగి చెప్పారు.
అంతేకాదు తమ పార్టీ తిరిగి ఎన్డీఏ కూటమిలోకి వెళ్లడం గురించి ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని కూడా ఆయన ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేశారు. రాష్టప్రతి పదవికి కోవింద్ అభ్యర్థిత్వాన్ని సమర్థించినప్పటికీ మోదీ ప్రభుత్వం అన్ని రంగాల్లోను ఘోరంగా విఫలమైందనే తమ పార్టీ భావిస్తోందని త్యాగి స్పష్టం చేశారు. అయోధ్య, ఉమ్మడి పౌరస్మృతి, 370 అధికరణ అంశాలు ఇప్పటికీ ఎన్డీఏకు, జెడి(యు)కు మధ్య వివాదాస్పద అంశాలుగానే కొనసాగుతున్నాయని అన్నారు. నిజానికి గత మూడేళ్ల కాలంలో మత ఉద్రిక్తతలు మరింత పెరిగిపోయాయని చెప్పారు.