జాతీయ వార్తలు

మినహాయింపు ఇవ్వాల్సిందే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 5: వైద్య విద్యకు దేశవ్యాప్త ఉమ్మడి ప్రవేశ పరీక్ష (నీట్) నుంచి తమకు మినహాయింపుఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టు ముందు వాదనలు వినిపించింది. నీట్ పరీక్ష నిర్యహణపై విచారణను సుప్రీం కోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది. తెలంగాణ ప్రభుత్వం ధర్మాసనం ముందు వాదనలు వినిపించనుంది. నీట్ నిర్వహణపై ఆదేశాలను పునఃపరిశీలించాలని ఆత్యున్నత న్యాయస్థానం ముందు దాఖలైన వివిధ రాష్ట్రాలు, విద్యా సంస్థల మధ్యంతర పిటిషన్‌లను జస్టిస్ అనిల్ ఆర్ దావే, జస్టిస్ శివ కిర్తిసింగ్, జస్టిస్ ఎకె గోయల్‌తో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది పిపి రావు, బసవప్రభు పాటిల్ వాదనలు వినిపిస్తు‘ రాజ్యాంగంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు రక్షణగా ఉన్న ఆర్టికల్ 371(డి) ఈ ఆదేశాలు విఘాతం కల్గిస్తోంది’అని అన్నారు. తెలుగులో చదువుకున్న విద్యార్థులకు నీట్ వల్ల తీవ్ర నష్టం కలుగుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 95, 107లో పదేళ్లపాటు రెండు రాష్ట్రాల్లో జోనల్ వ్యవస్థ కొనసాగాలని పొందుపరిచారని, ఇప్పుడు నీట్ నిర్వహిస్తే ఆ చట్టాన్ని ఉల్లంఘించినట్టేనని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే ఎంసెట్ నిర్వహించిన విషయాన్ని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చిన న్యాయవాదులు, వాటి ఫలితలను వెల్లడించేందుకు అనుమతించాలని ధర్మాసనాన్ని కోరారు. పరీక్ష సిబిఎస్‌సి సిలబస్‌లో ఉంటున్నందున ఆ పుస్తకాలు తెలుగులో లభ్యం కావని వారన్నారు. మే1 హాజరైన విద్యార్థులు రెండో విడత జులై 24 జరిగే పరీక్షకు హాజరయ్యేందుకు అవకాశం కల్పించాలని ఏపి తరఫున్యాయవాది అభ్యర్థించారు. గురువారం దాదాపు అన్ని రాష్ట్రాలకు సుప్రీంకోర్టు ముందు వాదనలు వినిపించే అవకాశం కలిగింది. పశ్చిమ బెంగాల్, అసోం, తెలంగాణ రాష్ట్రాలకు వాదనలు వినిపించేందుకు అవకాశం రాలేదు. దీంతో సుప్రీంకోర్టు నీట్ అభ్యంతరలను ఒక పేజీలో తెలపాలని ఆ రాష్ట్రాలకు సుచించింది. శుక్రవారం తమ వాదనలు వినిపించేందు తెలంగాణ సిద్ధమవుతోంది.
నేడే తుది తీర్పు వెల్లడి
నీట్ నుంచి మినహాయింపునివ్వాలంటూ దాదాపు 18 రాష్ట్రాలు దాఖలు చేసిన మధ్యతర పిటిషన్‌లను విచారణను సుప్రీం కోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది. నీట్ నిర్వహించడంపై సుప్రీంకోర్టు నుంచి ఇంకా స్పష్టత ఇవ్వాల్సిన అవసరం లేదని అభిప్రాయ పడింది. ఈ ఏడాది రాష్ట్రాలు సొంతంగా ప్రవేశపరీక్ష నిర్వహించడంపై కేంద్రం తమ అభిప్రాయం శుక్రవారం తెలపాలని ఆదేశించింది. ప్రైవేటు విద్యా సంస్థలు సొంతంగా ప్రవేశపరీక్ష నిర్వహించుకోడానికి సుప్రీం అంగీకరించలేదు. ప్రాంతీయ బాషలో చదువుకున్న విద్యార్థులు నీట్ వల్ల నష్టపోతారని గుజరాత్, మహారాష్ట్ర, జమ్మూకాశ్మీర్‌తో సహా పలు రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఈమేరకు ధర్మాసనం ఎదుట వాదనలు వినిపించాయి. కేంద్ర తరఫున హాజరైన న్యాయవాది జనరల్ రంజిత్ కుమార్ నిబంధనలు ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. సీట్ల కేటాయింపు, రిజర్వేషన్లు, మైనార్టీల కోటా అన్ని ఆయా రాష్ట్రాల నిబంధనల ప్రకారమే భర్తీ అవుతాయని కోర్టుకు తెలిపారు. అలాగే మొదటి దఫా పరీక్షకు హజరుకాని వారికి సడలింపు ఇచ్చేందుకు కేంద్ర సుముఖంగా ఉందని ధర్మాసనానికి తెలిపారు. కొన్ని రాష్ట్రాలు గురువారం వాదనలు వినిపించగా మిగిలినవి నీట్‌పై తమ అభ్యంతరాలను ఒకే పేజీలో కోర్టుకు సమర్పిస్తాయి.