జాతీయ వార్తలు

టీచర్లకు ఉమ్మడి సర్వీసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, హైదరాబాద్, జూన్ 22: ఉపాధ్యాయుల దశాబ్దాల కల నెరవేరింది. అందరికీ ఒకేరకమైన సర్వీసు నిబంధనలు ఉండాలని ఇనే్నళ్లుగా వారు చేస్తున్న పోరాటం ఫలించింది. దాదాపు రెండున్నర దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీసు ఫైలుపై రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ గురువారం సంతకం చేశారు. తెలుగు రాష్ట్రాల్లోని పాఠశాల విద్యాశాఖల్లో అత్యంత సంక్లిష్టంగా మారిన ప్రభుత్వ పంచాయతీరాజ్ ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీసు నిబంధనల సమస్యకు తెరపడింది. ఈ ఫైలుకు రాష్టప్రతి ఆమోదం లభించటంతోపాటు ఇందుకు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్‌ను సోమ,మంగళ వారాల్లో జారీ కావచ్చునని రాష్టప్రతి భవన్ వర్గాలు తెలిపాయి. ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీసుల ప్రతిపాదనకు ప్రధాన మంత్రి నరేంద్రమోదీ రెండు రోజుల క్రితమే ఆమోదముద్ర వేయటం తెలిసిందే. ఇందుకు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ జారీ కాగానే రెండు తెలుగురాష్ట్రాల్లోని ఉపాధ్యాయులకు భారీగా పదోన్నతులు లభిస్తాయి. దీనిమూలంగా ప్రభుత్వ పాఠశాలలపై పర్యవేక్షణ పెరుగుతుంది, ఉపాధ్యాయ విద్య శిక్షణ సంస్థలైన డైట్, బీఈడి కళాశాలలు పటిష్టమవుతాయని అంటున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలలోని రెండు లక్షల డెబ్బై ఐదు వేల మందికి ఉమ్మడి సర్వీసు నిబంధనలు అమలులోకి వస్తాయి. ఈ నిబంధనలు అమలులోకి వచ్చిన మరుక్షణం పాఠశాల విద్యా వ్యవస్థలోని తొంభై శాతం సమస్యలు పరిష్కారమవుతాయని భావిస్తున్నారు. ఉపాధ్యాయుల ఉమ్మడి సర్వీసు నిబంధనలు అమలులోకి రావడంతో ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే 20వేల మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు లభించనున్నాయి. ఉమ్మడి సర్వీసు రూల్స్ అమలులోకి రావడం వల్ల విద్యా వ్యవస్థలో గుణాత్మకమైన మార్పు వస్తుంది. విద్యాశాఖలో నెలకొన్న సంక్షోభానికి శాశ్వతంగా తెరిపడినట్టేనని ఉపాధ్యాయ సంఘాలు కొనియాడుతున్నాయి.
సమస్యలకు శాశ్వత పరిష్కారం: పాతూరి
ఏకీకృత సర్వీసు రూల్స్‌కు రాష్టప్రతి ఆమోదం తెలపడంతో నాలుగు దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న ఉపాధ్యాయుల ప్రధాన సమస్యలకు శాశ్వతంగా పరిష్కారం లభించినట్టు అయిందని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఉపాధ్యాయుల పదోన్నతులకు ఇక అడ్డంకులు తొలిగిపోయినట్టేనని, అలాగే కొత్త పోస్టుల భర్తీకి మార్గం సుగమం అయిందన్నారు.
ఇరు రాష్ట్రాల ఉపాధ్యాయులకు పండుగ రోజు: టిటిఎఫ్
ఏకీకృత సర్వీసు రూల్స్‌కు ఆమోదం లభించడం ఇరు తెలుగు రాష్ట్రాల ఉపాధ్యాయులకు పండుగ రోజని తెలంగాణ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎ రామచంద్రం, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇ రఘునందన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నిర్ణయం వల్ల రాష్ట్రంలో విద్యారంగం గాడిలో పడుతుందని. విద్యారంగం పర్యవేక్షణ సులభతరం అవుతుందన్నారు. గెజిట్ నోటిఫికేషన్ వెలువడగానే తదుపరి ఉపాధ్యాయుల పదోన్నతులకు ఏర్పాట్లు చేయాలన్నారు.
విద్యారంగ సంక్షోభానికి తెర: టిఎస్‌యుటిఎఫ్
ఏకీకృత సర్వీసు రూల్స్ అమలులోకి వస్తే పుష్కరకాలం విద్యారంగంలో నెలకొన్న సంక్షోభానికి తెరపడుతుందని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టిఎస్‌యుటిఎఫ్) అభివర్ణించింది. రెండు వేల సంవత్సరం నుంచి రెండు వేల ఐదు వరకు అమలు జరిగిన అన్ని రకాల పదోన్నతులలో అందరికీ సమాన అవకాశాలు లభిస్తాయని టిఎస్‌యుటిఎఫ్ విశే్లషించింది. వేలాది మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు లభించడం ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు.

ఏకీకృత సర్వీసు రూల్స్ వల్ల లబ్ధిపొందేది

ఉపాధ్యాయులు 1.75 లక్షల మంది
ఉద్యోగ విరమణ పొందిన ఉపాధ్యాయులు 20,000
పదోన్నతుల ద్వారా లబ్ధిపొందే వారి సంఖ్య 20,000
మండల విద్యాధికారులు 450
డిప్యూటీ విద్యాధికారులు 45
డైట్ లెక్చరర్లు 400
జెఎల్ 1000
స్కూల్ అసిస్టెంట్లు 3000
ఎస్‌జిటి 3000

చిత్రం.. రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ.