జాతీయ వార్తలు

క్షమాభిక్షకు జాధవ్ వినతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 22: క్షమాభిక్ష పెట్టాలని పాకిస్తాన్‌లో మరణ శిక్షపడ్డ భారత్‌కు చెందిన కుల్‌భూషణ్ జాధవ్ అక్కడి ఆర్మీ చీఫ్ ఖామర్ జావెద్ బాజ్వాకు దరఖాస్తు చేసుకున్నారు. ఈ మేరకు గురువారం పాకిస్తాన్ ఆర్మీ ఓ ప్రకటన విడుదల చేసింది. గూఢచర్యం, ఉగ్రవాదం, విధ్వంస కార్యకలాపాలకు పాల్పడ్డారన్న అభియోగంపై అరెస్టయిన జాధవ్ నేరాన్ని అంగీకరించాడని, తనకు క్షమాభిక్ష పెట్టాలని కోరుతూ ఆర్మీ చీఫ్‌కు దరఖాస్తు చేసుకున్నట్లు ఆ ప్రకటనలో పాక్ అధికారులు పేర్కొన్నారు. పాకిస్తాన్ చట్టం ప్రకారం మరణ శిక్ష పడ్డ ఖైదీలు క్షమాభిక్ష కోసం ఆర్మీ చీఫ్‌కు అభ్యర్థన పెట్టుకోవచ్చు. ఆర్మీ చీఫ్ ఆ అభ్యర్థనను తిరస్కరిస్తే అధ్యక్షుడికి అప్పీలు చేసుకోవచ్చు. ఈమేరకు జాదవ్ తన నేరాన్ని అంగీకరిస్తున్నట్టు ఉన్న వీడియోను పాక్ ఆర్మీ విడుదల చేసింది. ఇరాన్ నుంచి బలుచిస్తాన్‌కి వెళ్లిన జాదవ్‌ను గత మార్చి 3న పాకిస్తాన్ అక్రమంగా అరెస్టు చేసి గూఢచారిగా ముద్రవేసి మరణ శిక్ష విధించారని భారత్ చేస్తున్న ప్రచారం తప్పని ఈ వీడియోతో తెలుస్తుందని పాక్ ఆర్మీ పేర్కొంది. జాదవ్‌ను అక్రమంగా అరెస్టు చేశారని అతనికి విధించిన మరణ శిక్షను రద్దు చేయాలని కోరుతూ గత మే 18న అంతర్జాతీయ న్యాస్థానం (ఐసిజె)లో భారత్ సవాలు చేసిన విషయం తెలిసిందే. పది మంది జడ్జిలతో కూడిన ఐసిజె ధర్మాసనం జాదవ్ మరణ శిక్ష అమలును అపాల్సిందిగా పాకిస్తాన్‌ను ఆదేశించింది. ఈ నేపథ్యంలో పాక్ ఆర్మీ నేడు జాదవ్ నేరాంగీకార వీడియోను విడుదల చేసింది.