జాతీయ వార్తలు

భారతీయులు సురక్షితం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 22:ఖతార్‌లో ఉన్న భారతీయులందరూ సురక్షితంగా, భద్రంగానే ఉన్నారని కేంద్ర ప్రభుత్వం గురువారం ప్రకటించింది. గల్ఫ్ దేశాలు విధించిన ఆంక్షల కారణంగా ఖతార్‌తో సంబంధాలు తెగిపోవడంతో భారత్‌కు తిరిగి రావాలనుకునే వారికోసం ప్రత్యేక విమానాలు నడుపుతున్నామని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి గోపాల్ బాగ్లే తెలిపారు. ఖతార్ నుంచి భారతీయులను తరలించాల్సిన అవసరం లేదని, అక్కడ ఉన్నవారికి ఎలాంటి ఇబ్బంది లేదని ఆయన వివరించారు. ప్రాంతీయ రాజకీయ కారణాల మూలంగా ఖతార్ ఏకాకి అయిందని, విమానాల రాకపోకలు ఆగిపోవడమే సమస్య అని స్పష్టం చేశారు. స్వదేశానికి రావాలనుకునే భారతీయ పౌరుల కోసం ప్రత్యేక విమాన సర్వీసులు నిర్వహిస్తున్నామని తెలిపారు. రంజాన్, ఈద్‌కోసం భారత్‌కు రావాలనుకునే వారికి ఈ సర్వీసులు ఉపయోగపడుతున్నాయన్నారు. ఈద్‌కు ముందు భారీగా డిమాండ్ ఉంటుంది కాబట్టి దోహాకు అదనపు విమాన సర్వీసులను నడపాలని ఎయిర్ ఇండియా, జెట్ ఎయిర్‌వేస్‌ను కోరడం జరిగిందని చెప్పారు.