జాతీయ వార్తలు

రుణమాఫీ ఫ్యాషన్‌గా మారింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 22: రుణమాఫీ అన్నది ఫ్యాషన్‌గా మారిపోయిందని బిజెపి సీనియర్ నేత, కేంద్ర మంత్రి ఎం వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. కొన్ని ప్రత్యేక పరిస్థితులు తలెత్తినప్పుడు మాత్రమే రుణమాఫీ చేయొచ్చని గురువారం ఇక్కడ అన్నారు. అయితే ఈ రోజుల్లో అదో ఫ్యాషన్‌గా మారిపోయిందని వెంకయ్య చెప్పారు. రుణమాఫీతోనే రైతుల ఆర్థిక స్థితిగతులు మెరుగవ్వవని, అలాగే అదే చివరి పరిష్కారం కూడా కాదని మంత్రి పేర్కొన్నారు. మంత్రి వ్యాఖ్యలపై సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారామ్ ఏచూరి విరుచుకుపడ్డారు. ఈ మూడేళ్లలో 40 నుంచి 36 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, మంత్రి ప్రకటన అన్నదాతులను అగౌరపరచడమేనని ఏచూరి విమర్శించారు. రైతుల రుణాలు మాఫీ చేయనున్నట్టు కర్నాటక ప్రభుత్వం బుధవారం ప్రకటించిన నేపథ్యంలో వెంకయ్యనాయుడు ఈ వ్యాఖ్యలు చేశారు. సహకార బ్యాంకుల్లో పంట రుణాలు తీసుకున్న 22 లక్షల మందికి మాఫీ వర్తింప చేస్తామని కర్నాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య వెల్లడించారు. 50 వేల వరకూ పంట రుణాలు మాఫీ చేస్తామని ఆయన అన్నారు. అలాగే పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ కూడా రైతుల రుణమాఫీని ప్రకటించారు. రాష్ట్రంలోని చిన్న, మధ్యతరగతి రైతుల పంట రుణాలన్నీ మాఫీ చేయనున్నట్టు అమరీందర్ తెలిపారు. బిజెపి పాలిత మహారాష్టల్రోనూ రుణమాఫీ ప్రకటించిన సంగతి తెలిసిందే. రైతు ఆత్మహత్యలు అరికట్టడానికి, అప్పుల ఊబిలోంచి రైతులను గట్టెక్కించడానికి రుణమాఫీ చేస్తున్నట్టు ముఖ్యమంత్రి దేవేందర్ ఫడ్నవీస్ చెప్పారు. మరోపక్క రాష్ట్రాలు ప్రకటించిన రుణమాఫీ పథకానికి కేంద్రం నిధులు అందజేయదని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. బిజెపి ప్రభుత్వం అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్ రైతు ఉద్యమాలతో అట్టుడికిపోతోంది. గిట్టుబాటు ధర, రుణమాఫీ కోసం ఆందోళన చేస్తున్న రైతులపై పోలీసు కాల్పులు జరగ్గా ఆరుగురు మృతి చెందారు. రాష్ట్రంలో వందలాది మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఉత్తరప్రదేశ్‌లో చిన్న, మధ్య తరహా రైతులకు 36,359 కోట్ల రూపాయలు మాఫీ చేయనున్నట్టు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఇంతకుముందే ప్రకటించింది.