జాతీయ వార్తలు

సమస్యలను కలిసికట్టుగా ఎదుర్కొందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 22: ఆగ్నేయాసియా దేశాలతో వాణిజ్య, అర్థిక, సాంస్కృతిక సంబంధాలను మరింత మెరుగు పరుచుకునేందుకు భారత్ కృషి చేస్తోందని విదేశాంగ మంత్రి సుష్మ స్వరాజ్ తెలిపారు. ఆగ్నేయాసియా దేశాలతో (ఏసియన్) గత రెండేళ్లుగా అంతంత మాత్రంగా ఉన్న వాణిజ్యం ఇప్పుడు వృద్ధిబాట పట్టిందని, ఈ దిశగా 2016-17లో ఏకంగా 8శాతం వృద్ధి నమోదు చేసుకుందని ఆమె పేర్కొన్నారు. గురువారం ఇక్కడ పరిశోధన, సమాచార వ్యవస్థలో ఆగ్నేయాసియా- భారత్ సంబంధాలపై జరిగిన సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా భారత్-ఏసియన్ దేశాలు ఎదుర్కొంటున్న ఆయుధాల స్మగ్లింగ్, మానవ ట్రాఫికింగ్, సైబర్ క్రైం, ఉగ్రవాదం తదితర అంశాలపై మాట్లాడారు. ఈ ప్రాంతంలోని ఉమ్మడి సమస్యలను అందరం కలిసికట్టుగా ఎదుర్కోవాలని ఆమె అన్నారు. ఈ ప్రాంత భద్రతకు శాంతియుత పరిష్కారాన్ని కనుగోడానికి అన్ని దేశాలు కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. భారత్ వాణిజ్య సంబంధాల్లో ఏసియన్ దేశాలు అత్యధిక ప్రాధాన్యను కలిగి ఉన్నాయని అన్నారు. దేశ వాణిజ్యంలో పది శాతం ఎసియన్ దేశాలతో నెరపుతున్నట్టు పేర్కొన్నారు. ఏసియన్, ఎఫ్‌టిఎలోని ఆరు భాగస్వామ్య దేశాలతో వాణిజ్య సంబంధాలు పెంపొందించుకునేందుకు భారత్ ఆసక్తిగా ఉందని అన్నారు. ఈ దేశాలతో వాణిజ్య సంబంధాలు మరింత మెరుగు పరుచుకునేందుకు ఆకాశ, జల, రోడ్డు మార్గాల అభివృద్ధికి భారత్ కృషి చేస్తోందని చెప్పారు. డిజిటల్ కనెక్టివిటీని మరింత మెరుగుపర్చేందుకు జాతీయ రూరల్ బ్రాడ్ బ్యాండ్, ప్రాంతీయంగా హై కెపాసిటీ ఫైబర్ ఆప్టిక్ నెట్‌వర్క్‌ను అభివృద్ధి పరిచేందుకు ప్రభుత్వం ప్రణాళికను సిద్ధం చేస్తోందని వెల్లడించారు. ఆగ్నేయాసియా దేశాలతో వాణిజ్య సంబంధాలే కాకుండా సాంస్కృతి సంబంధాలను మెరుగు పరుచుకునేందుకు కూడా కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. హిం సంస్కృతికి సంబంధించిన ఎన్నో కట్టడాలు థాయ్‌ల్యాండ్‌లోనూ కనిపిస్తాయని, అలాగే వియత్నాంలోని చామ్ దేవాలయం, కంబోడియాలోని ఆంకోర్ వాట్ ఆలయం, లావోలోని వాటపౌ ఆలయం, మైన్మార్‌లోని ఆనంద ఆలయం ఇలా ఎన్నో కట్టడాలు ఈ దేశాల్లో కనిపిస్తాయని అన్నారు. హిందూ సంస్కృతి విరాజిల్లుతున్న ఈ దేశాలతో ఆర్థిక, వాణిజ్య, సాంస్కృతిక సంబంధాలు మరింత మెరుగు పర్చుకునేందుకు భారత్ కృషి చేస్తోందని ఆమె పేర్కొన్నారు.