జాతీయ వార్తలు

నేడు ఎన్డీయే ‘బల’ప్రదర్శన!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 22: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బిజెపి రాష్టప్రతి అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్ నామినేషన్ పత్రాల దాఖలు కార్యక్రమాన్ని ఎన్‌డిఏ బలప్రదర్శనగా మార్చివేశారు. జెడి(యు), అన్నాడిఎంకె, టిఆర్‌ఎస్, వైఎస్‌ఆర్‌సిపి, బీజూ జనతాదళ్ పార్టీల మద్దతు సంపాదించటం ద్వారా ఎన్‌డిఏ బలాన్ని దాదాపు 60 శాతానికి పెంచిన నరేంద్ర మోదీ దీనిని నామినేషన్ పత్రాలను దాఖలు చేసే సమయంలో ప్రదర్శించేందుకు సిద్ధమయ్యారు. నరేంద్ర మోదీ, బిజెపి అధ్యక్షుడు అమిత్ షా, అకాలీదళ్ అధ్యక్షుడు ప్రకాశ్‌సింగ్ బాదల్, ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతోపాటు దాదాపు ఇరవై రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పలువురు సీనియర్ నాయకులు, కేంద్ర మంత్రులు బిజెపి అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్ తరపున శుక్రవారం ఉదయం పదకొండు గంటలకు నామినేషన్ పత్రాలను దాఖలు చేయనున్నారు. పార్లమెంటు ఆవరణలోని లోక్‌సభ సెక్రటరీ జనరల్ అనూప్ మిశ్రా కార్యాలయానికి వెళ్లి రామ్‌నాథ్ కోవింద్ నామినేషన్ పత్రాలను దాఖలు చేయనున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం అనూప్ మిశ్రాను కొత్త రాష్టప్రతి ఎన్నికకు రిటర్నింగ్ అధికారిగా నియమించటం తెలిసిందే. అధికార, ప్రతిపక్షానికి చెందిన మెజారిటీ రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటించటంతో రామ్‌నాథ్ కోవింద్ ఎన్నిక ఏకపక్షంగా మారిపోయింది. దళిత వర్గానికి చెందిన రామ్‌నాథ్ కోవింద్‌ను ఎంపిక చేయటం ద్వారా ప్రతిపక్షాన్ని నిలువునా చీల్చిన నరేంద్ర మోదీ ఇప్పుడు నామినేషన్ పత్రాల దాఖలు కార్యక్రమాన్ని బలప్రదర్శనగా మార్చటంద్వారా మరోసారి కాంగ్రెస్, వామపక్షాలను దెబ్బతీసేందుకు రంగం సిద్ధం చేశారు. రామ్‌నాథ్ తరపున నరేంద్ర మోదీ, అమిత్ షా, చంద్రబాబు నాయుడు, ప్రకాశ్‌సింగ్ బాదల్ నాలుగు సెట్ల నామినేషన్ పత్రాలను దాఖలు చేస్తారు. నామినేషన్ దాఖలు కార్యక్రమానికి హాజరయ్యేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గత రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు. చంద్రబాబునాయుడు, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ శుక్రవారం ఉదయం ఢిల్లీకి చేరుకుంటారు. తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామిని కూడా బిజెపి ఈ కార్యక్రమానికి ఆహ్వానించింది. బిజెపి ముఖ్యమంత్రులందరూ రేపు ఉదయం ఢిల్లీకి చేరుకున్నారు.

చిత్రం.. గురువారం ఢిల్లీలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయ నివాసానికి వెళ్లి పరామర్శిస్తున్న ఎన్డీయే రాష్టప్రతి అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్. పక్కన ఆయన భార్య సవిత