జాతీయ వార్తలు

సిబిఐ దర్యాప్తు జరపాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డార్జిలింగ్, జూన్ 23: ప్రత్యేక గూర్ఖాలాండ్ ఏర్పాటు కోసం ఉద్యమం ఉద్ధృతం చేస్తామని గూర్ఖా జనముక్తి మోర్చా(జిజెఎం) అధినేత బిమల్ గురుంగ్ ప్రకటించారు. హిల్ ఏరియాలో ఈనెల 17న జరిగిన పోలీసు కాల్పులపై సిబిఐ దర్యాప్తు జరపాలని శుక్రవారం ఆయన డిమాండ్ చేశారు. గూర్ఖాలాండ్ టెరిటోరియల్ అడ్మినిస్ట్రేషన్(జిటిఏ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ పదవికి రాజీనామా చేసిన బిమల్‌‘ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం కొనసాగుతుంది’అని ప్రకటించారు. గూర్ఖాలాండ్‌ను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలన్న ఒకే ఒక్క డిమాండ్‌తో జిటిఏకు రాజీనామా చేసినట్టు ఆయన తెలిపారు. గత కొన్ని రోజుల అజ్ఞాతంలోనే ఉంటున్న జిజెఎం చీఫ్ డార్జిలింగ్‌లోని పట్లేబాస్‌లో మీడియా సమావేశంలో మాట్లాడారు.‘ పోలీసులు ఎన్‌కౌంటర్ చేసిన మావోయిస్టునేత కిషన్‌జీని కాదు. నా వద్ద ఆయుధాలు లేవు. గూర్ఖాలాండ్‌ను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించాలన్నదే నా డిమాండ్. దాని కోసం అవిశ్రాంతగా పోరాడుతున్నాను. ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడడం నా హక్కు’అని బిమల్ చెప్పారు. తమ పోరాటం అంతం కాదని, సమస్య పరిష్కరించేవరకూ విశ్రమించబోనని ఆయన ప్రకటించారు. 17న హిల్ ఏరియాలో పోలీసులు కాల్పులు జరిపి జిజెఎం కార్యకర్తను బలితీసుకున్నారని ఆరోపించారు. కాల్పుల వ్యవహారానికి సంబంధించి తమ వద్ద వీడియో ఉందని, ఆ సంఘటనపై సిబిఐ విచారణ జరపాల్సిందేనని గురుంగ్ డిమాండ్ చేశారు. జిజెఎం కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తూ ప్రభుత్వం మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతోందని విమర్శించారు.