జాతీయ వార్తలు

వృద్ధులు, పిల్లలకు పాస్‌పోర్టు ఫీజులో 10శాతం తగ్గింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 23: పాస్‌పోర్టుల్లో వ్యక్తిగత వివరాలు ఇకపై ఏవలం ఇంగ్లీషులో కాకుండా హిందీ, ఇంగ్లీషు భాషల్లో ఉంటాయని విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ చెప్పారు. ఇప్పటివరకు ఈ వివరాలు కేవలం ఇంగ్లీషులోనే ఉండేవి. అంతేకాకుండా ఎనిమిదేళ్ల లోపు పిల్లలు, అరవై ఏళ్లకు పైబడిన వారి పాస్‌పోర్టు దరఖాస్తు ఫీజును పది శాతం తగ్గించినట్లు కూడా సుష్మాస్వరాజ్ చెప్పారు. 1967 నాటి పాస్‌పోర్టు చట్టం 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా శుక్రవారం జరిగిన ఓ కార్యక్రమంలో సుష్మాస్వరాజ్ ఈ విషయం చెప్పారు. భారీ మార్పుల్లో పుట్టిన తేదీ ప్రూఫ్‌గా బర్త్ సర్ట్ఫికెట్‌ను తప్పనిసరిగా సమర్పించాలన్న నిబంధనను తొలగించడం. విడిపోయిన, విడాకులు తీసుకుని ఒంటరిగా ఉంటున్న వారు దరఖాస్త్ఫురాల్లో తమ జీవిత భాగస్వామి పేరును పేర్కొనాల్సిన అవసరం లేదని కూడా పేర్కొన్నారు. సాధువులు, సన్యాసులు దరఖాస్తు ఫారాల్లో కన్న తల్లిదండ్రుల పేర్లకు బదులు తమ ఆధ్యాత్మిక గురువుల పేర్లను పేర్కొనడానికి సైతం అనుమతించారు.

చిత్రం.. ఢిల్లీలో శుక్రవారం పాస్‌పోర్టు చట్టం 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఫస్ట్‌డే కవర్‌ను విడుదల చేస్తున్న కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్