జాతీయ వార్తలు

యుపిలో వక్ఫ్‌బోర్డు సభ్యుల పునర్నియామకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, జూన్ 23: షియా వక్ఫ్‌బోర్డు సభ్యుల తొలగింపు వ్యవహారంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. ఆరుగురు నామినేటెడ్ సభ్యులను తొలగిస్తూ యుపి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అలహాబాద్ హైకోర్టు శుక్రవారం కొట్టివేయడంతో పాటు వారిని తిరిగి నియమిస్తూ జస్టిస్ రాజన్‌రాయ్, జస్టిస్ ఎస్.ఎన్.అగ్నిహోత్రి ఈ ఆదేశాలు జారీచేశారు. అయితే ఇందుకు సంబంధించి చట్ట ప్రకారం వ్యవహరించేలా హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి స్వేచ్ఛను కల్పించింది. వక్ఫ్ ఆస్తులకు సంబంధించి అక్రమాలకు పాల్పడుతున్నారంటూ ఈ నెల 16న షియా వక్ఫ్‌బోర్డుకు చెందిన ఆరుగురు సభ్యులను తొలగించింది. ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ అలీమా జైదీ నాయకత్వంలో వీరు హైకోర్టును ఆశ్రయించారు. వీరంతా సమాజ్‌వాది పార్టీ ప్రభుత్వ హయాంలో నియమితులైనవారు కావడం గమనార్హం. వక్ఫ్ నిధుల్లో బోర్డు సభ్యులు కోట్లాది రూపాయలను అవినీతికి పాల్పడ్డారని, దీనిపై సిబిఐ విచారణకు సిఫార్సు చేయడంతో పాటు షియా, సున్నీ వక్ఫ్ బోర్డులను రద్దుచేస్తూ యుపి ప్రభుత్వం 15న ఉత్తర్వులు జారీచేసిన విషయం విదితమే. ఈ రెండు బోర్డుల పరిధిలో వున్న ఆస్తులకు సంబంధించి అనేక అక్రమాలు చోటుచేసుకున్నాయని తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. ఇందులో షియా వక్ఫ్‌బోర్డు చైర్మన్ వాసిమ్ రిజ్వీతోపాటు గత ప్రభుత్వంలో వక్ఫ్ శాఖ మంత్రిగా పనిచేసిన ఆజమ్‌ఖాన్ కీలక పాత్ర ఉందనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో వక్ఫ్ కౌన్సిల్ విచారణను కూడా వీరు ఎదుర్కొంటున్నారు. ఆజంఖాన్ మాత్రం ఆరోపణలన్నీ నిరాధారమని కొట్టివేశారు.