జాతీయ వార్తలు

సాహో ఇస్రో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూళ్లూరుపేట, జూన్ 23: వరుస అంతరిక్ష ప్రయోగాలతో దూసుకెళ్తున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో విజయాన్ని తన ఖాతలో జమ చేసుకుంది. ఒకే రాకెట్ ద్వారా 31 ఉపగ్రహాలను పది కక్ష్యల్లోకి పంపి భారత శాస్తవ్రేత్తలు సత్తాచాటారు. ఇస్రో కదనాశ్వం పిఎస్‌ఎల్‌వి-సి 38 మరోసారి విజయబావుటా ఎగరవేసింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన కార్టోశాట్-2ఇ ఉపగ్రహం, తమిళనాడు కోయంబత్తూరు నూరుల్ ఇస్లాం యూనివర్సిటి విద్యార్థులు రూపొందించిన ఎన్‌ఐయూ శాట్ ఉపగ్రహంతో పాటు విదేశాలకు చెందిన 29 ఉపగ్రహాలతో కలిపి మొత్తం 31 ఉపగ్రహాలను పిస్‌ఎల్‌వి వాహక నౌక విజయవంతంగా మోసుకెళ్లింది. ఈ ప్రయోగం పయనం 23 నిమిషాల పాటు జరిగింది. దీంతో భారత్ ఎక్కువ ఉపగ్రహాలు ఒకేరాకెట్ ద్వారా వివిధ కక్ష్యల్లోకి ప్రయోగించి ప్రపంచ దేశాల్లో మొదటి స్థానం సంపాదించడమే కాకుండా ఇస్రో శాస్తవ్రేత్తలు సరికొత్త రికార్డు సృష్టించారు. ఈ ప్రయోగం కోసం నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీస్ థావన్ స్పేస్ సెంటర్ (షార్) వేదికైంది. షార్‌లో గురువారం ఉదయం 5గంటల 29నిమిషాలకు ప్రారంభమైన కౌంట్‌డౌన్ 28గంటలపాటు నిర్విఘ్నంగా కొనసాగింది. శుక్రవారం ఉదయం 9గంటల 29నిమిషాలకు షార్‌లోని మొదటి ప్రయోగ వేదిక నుండి నిప్పులు చిమ్ముకుంటూ పిఎస్‌ఎల్‌వి-సి 38 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. రాకెట్ నింగికెగసిన అనంతరం తన నాలుగు దశలను సునాయశనంగా పూర్తిచేసుకొని వరుసగా 39వ విజయాన్ని నమోదు చేస్తూ 31 ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టడంతో ఇస్రోలో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. పిఎస్‌ఎల్‌వి-సి 38 వాహక నౌక ప్రయోగనంతరం 8 నిమిషాలకు వరుసగా మూడు దశల ఇంజన్లసాయంతో పనిచేస్తూ భూ ఉపరితలానికి 424 కి.మీ ఎత్తుకు రాకెట్‌ను చేర్చింది. అనంతరం నాలుగో దశ ఇంజన్ ఉపగ్రహాలతో పనిచేస్తూ 15 నిమిషాలకు 509 కి.మీ ఎత్తుకు చేరుకొంది. అనంతరం ఈ దశలో ఇంజన్‌ను ఆఫ్ చేశారు. తిరిగి ఇంజన్ రీస్టాట్ చేసి 712కిలోలు బరువున్న కార్టోశాట్-2ఇ ఉపగ్రహాన్ని మొదట 16:40 నిమిషాలకు భూమికి 510 కి.మీ ఎత్తులో కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. వెంటనే మరో 10 సెకన్లలో 16:50 నిమిషాలకు తమిళనాడు యూనివర్సిటి విద్యార్థులు రూపొందించి ఎన్‌ఐయూ శాట్ ఉపగ్రహం రాకెట్ నుండి విడిపోయింది. అనంతరం 29 విదేశీ ఉపగ్రహాలను ఇంజన్ ఆఫ్‌చేస్తూ ఆన్ చేస్తూ నాలుగు దపాలుగా బూమికి 519 కి.మీ ఎత్తులో కక్ష్యలోకి విజయవంతంగా చేర్చారు. ఇది మొత్తం 23నిమిషాల్లో అన్ని ఉపగ్రహాలు వాహక నౌక విజయవంతంగా మోసుకెళ్లింది.
మిషన్ కంట్రోల్ సెంటర్‌లో సూపర్ కంప్యూటర్ల ద్వారా రాకెట్ గమనాన్ని చూస్తున్న ఇస్రో చైర్మన్ డాక్టర్ ఎఎస్.కిరణ్‌కుమార్ రాకెట్ నాలుగు దశలు పూర్తయి ఉపగ్రహాలు కక్ష్యలోకి చేరినంతరం పిఎస్‌ఎల్‌వి-సి 38 విజయాన్ని అధికారికంగా ప్రకటించి శాస్తవ్రేత్తలతో ఆనందాన్ని పంచుకొన్ని హర్షం వ్యక్తం చేశారు. ఎంసిసి నుంచే ఆయన నేరుగా మాట్లాడుతూ ఒకే రాకెట్ ద్వారా 31 ఉపగ్రహాలు పంపి విజయం సాధించిన ఘనత కొత్త రికార్డు ఇస్రోకు దక్కిందన్నారు. ఈ విజయం శాస్తవ్రేత్తల సమష్టికృషి భవిష్యత్‌లో ఒకే రాకెట్ ద్వారా పది కక్ష్యలోకి ప్రవేశపెట్టడంలో విజయం సాధించామన్నారు. ఈ ఉపగ్రహం 5సంవత్సరాలు పాటు సేవలు అందిస్తుందన్నారు.